BigTV English

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Tollywood Heroine.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ (Uday Kiran) హీరోగా నటించిన నువ్వు నేను చిత్రంతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న అనిత హస్సానందిని(Anita hassanandani) అప్పట్లోనే తన అందంతో, నటనతో కుర్ర కారును తన వశం చేసుకుంది. ఆ తర్వాత శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, ఆడంటే అదో టైపు, మనలో ఒకడు, నిన్నే ఇష్టపడ్డాను వంటి చిత్రాలు కూడా చేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన అనిత హస్సానందిని ఆ తర్వాత తమిళ్, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె పెళ్ళికి ముందు తన ప్రేమ కథను పంచుకుంది.


నా ప్రేమ విషయం మా అమ్మకు నచ్చలేదు..

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిత మాట్లాడుతూ.. నేను ఈజాజ్ తో ప్రేమలో పడ్డానని, అమ్మకు చెప్పడంతో అమ్మ ఆగ్రహించింది. మా ఇద్దరి మతాలు వేరు కావడం వల్లే నా ప్రేమ విషయం అమ్మకు నచ్చలేదు. అయినా సరే అమ్మ భయాలని అభిప్రాయాలను నేను పట్టించుకోలేదు. ఇకపోతే నిజానికి మేమిద్దరం ఎవరికివారు ప్రేమలో ఉన్నప్పుడు బాగానే ఉన్నాము కానీ కలిసి ఉన్నప్పుడే మా బంధం వర్కౌట్ కాలేదు. నిజానికి ఏ బంధంలో అయినా సరే ఎదుటివారిని మనకు నచ్చినట్టుగా మార్చుకోవాలి అనుకుంటే అది ప్రేమ అనిపించుకోదు. ఈ క్రమంలోనే అతడు నన్ను మార్చాలని ఎంతో ప్రయత్నం చేశాడు ఈ విషయం నాకు నచ్చలేదు.


Tollywood Heroine: Secretly the marriage that mother does not like.. If it is cut..!
Tollywood Heroine: Secretly the marriage that mother does not like.. If it is cut..!

ఎదుటి వ్యక్తిని గ్రిప్ లో పెట్టుకోవాలంటే అది ప్రేమ అనిపించదు..

నిజానికి ఈజాజ్ తో నేను ప్రేమలో కూరుకుపోయాను. అందుకే ఒకరి గురించి నేను మారాలనుకోలేదు. నేను నాలాగే ఉండాలనుకున్నాను. అలాగే ఉండి బంధం కొనసాగించాలి అనుకున్నాను. కానీ అది అతనికి నచ్చలేదు అందుకే బ్రేకప్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది అనిత. విడిపోయినప్పుడు ఆ బాధ నుంచి బయటపడడానికి దాదాపు ఏడాదికి పైగానే సమయం పట్టిందని తెలిపింది అనిత. ఆ సమయంలో నేను , నా బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాను. ప్రతిరోజు తనే నన్ను ప్రేమగా నిద్ర లేపేది. అందుకే నేను ఇచ్చే సలహా ఏమిటంటే ఎవరికోసమో మనం మారాల్సిన అవసరం లేదు మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని స్వీకరించాలి.

అలా చేస్తున్నాడంటే అతడు కరెక్ట్ పర్సన్ కాదు..

అంతేకాదు మీ పార్ట్నర్ ఫోన్ పై కూడా ఒకసారి కన్నేసి ఉంచండి. వారు ఫోన్ దాస్తూ మీకు ఇవ్వడానికి భయపడుతున్నారంటే ఏదో తప్పు చేస్తున్నారు అని లెక్క. కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉంచుతున్నాడు అంటే అతను మనకు కరెక్ట్ పర్సన్ కాదు అని తెలుసుకోండి అంటూ సూచనలు కూడా ఇచ్చింది అనిత.

అనిత కెరియర్..

ఇకపోతే అనిత , ఈజాజ్ ఇద్దరు కలిసి కావ్యాంజలి సీరియల్ లో నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ కుదిరింది. అయితే కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత అతడి గురించి తెలుసుకున్న ఈమె 2007లో అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత 2013లో రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనితకి 2021 లో ఆరవ్ అనే బాబు కూడా జన్మించారు. మొత్తానికైతే ఇండిపెండెంట్గా బ్రతకాలన్న అనిత కి అతడు పెట్టే కండిషన్స్ నచ్చకే విడిపోయినట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×