BigTV English

Aay Movie: ఏపీ వరద బాధితులకు ఆయ్ మూవీ టీమ్ సాయం

Aay Movie: ఏపీ వరద బాధితులకు ఆయ్ మూవీ టీమ్ సాయం

Tollywood movie Aay 25 percent collections gave to janasena for Vijayawada floods: చిన్న చిత్రంగా విడుదలై భారీ కలెక్షన్లు సొంతం చేసుకున్న మూవీ ఆయ్. ప్రతిష్టాత్మక గీత ఆర్ట్స్ 2 మూవీ బ్యానర్ పై నార్నే నితిన్ హీరోగా , నయన్ సారిక కథానాయికగా నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ చిత్రాల మధ్య రిలీజైన ఈ మూవీ వాటన్నింటినీ అధిగమించి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో వచ్చిన తంగలాన్, మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ మూవీలు కలెక్షన్లు సాధించలేక పోయాయి. అయితే ఈ సినిమాలతో పాటే రిలీజయిన ఆయ్ మూవీ మాత్రం యూత్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ సినిమాల మధ్య మీ చిన్న సినిమా ఎందుకు విడుదల చేస్తున్నారంటూ చాలా మంది డిస్కరేజ్ కూడా చేశారు. అయినా ఈ మూవీ కంటెంట్ పై పూర్తి నమ్మకంతో రిలీజ్ చేశారు నిర్మాతలు. మొదట్లో భారీ సినిమాల మధ్య విడుదల చేయడంతో థియేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది.


పెద్ద సినిమాల మధ్య విడుదలై..

క్రమంగా ఆ సినిమాలను థియేటర్ల యాజమాన్యం ఎత్తేసి ఆయ్ సినిమాను తమ థియేటర్లకు తెచ్చుకున్నారు. ఇక విడుదలైన రెండు వారాలకే 15 కోట్లు కలెక్షన్లు రాబట్టింది ఆయ్ మూవీ. చాలా తక్కువ బడ్జెట్ రూపొందించిన ఈ మూవీ దాదాపు 20 నుంచి 25 కోట్లు రాబట్టే దిశగా పరుగులు పెడుతోంది. కామెడీ ప్రధానాంశంగా ఈ మూవీని అచ్చ తేనె తెలుగుదనం గుర్తొచ్చేలా దర్శకుడు అంజి రూపొందించారు. కథలో ట్విస్టులు ఏమీ లేకపోయినా సన్నివేశాలపై మంచి గ్రిప్ ను కనబరిచాడు. ఇక ఈ మూవీకి పాటలే ప్రాణం పోశాయి. రామ్ మిర్యాల పాటలు యూత్ ని బాగా కట్టిపడేశాయి. కథ, కథనాలు ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. ఇక తన రెండో మూవీతో ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ నటనలో మంచి పరిణితి కనిపించింది. హీరోయిన్ నయన్ సారిక తెలుగులో తొలిసారి ఎంట్రీ ఇచ్చింది. అయినా తన అందం, అభియనంతో ఆకట్టుకుంది. సిసలైన గోదావరి తీరం అమ్మాయిలా కనిపించింది.


25 శాతం కలెక్షన్లు జనసేనకు..

ఇంతటి అపూర్వ విజయం సాధించిన ఈ మూవీ విజయోత్సాహంతో ఉంది. అయితే ఏపీలో వచ్చిన వరదలతో అక్కడ ప్రజలు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నారు. ప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి సహాయమందిస్తూ వస్తున్నాయి. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా ముందుకొచ్చి మరీ సాయం అందిస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కల్కి నిర్మాత తదితరులు తమ వంతు సాయం అందించారు. ఇప్పుడు ఆయ్ మూవీ టీమ్ కూడా ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 2 నుంచి ఈ మూవీకి వచ్చే కలెక్షన్లలో 25 శాతం జనసేక పార్టీ తరపున విరాళంగా ప్రకటించారు నిర్మాత బన్నీ వాసు. అయితే జనసేన నుంచి ఈ మొత్తం వరద బాధితులకు సాయం అందేలా చూడాలని కోరారు.

అభినందనల వెల్లువ

చిన్న సినిమా అయివుండి పెద్ద మనసుతో ఆయ్ టీమ్ ఇలా స్వచ్ఛందంగా వరద సాయం చేయడానికి ముందుకు వచ్చిందని అభినందిస్తున్నారు. ఆయ్ టీమ్ స్ఫూర్తికి స్పందిస్తున్నారు.
ఎంతసేపూ వచ్చిన లాభాలను తమ జేబుల్లో వేసుకుని ఆనందించే కొందరు నిర్మాతలు కనీసం సమాజ సేవకు ఎంతో కొంత కేటాయిస్తే బాగుంటుందని అంటున్నారు. ఇది నిజంగానే స్ఫూర్తిదాయకమైన చర్యగా అంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చిన్న చిత్రంగా రిలీజై పెద్ద సినిమా రేంజ్ కలెక్షన్లు అందుకుంటోంది ఆయ్ మూవీ. ముఖ్యంగా యూత్ చూసినవాళ్లే మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ మూవీ కలెక్షన్లు కూడా దాదాపు 60 నుంచి 70 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.

Related News

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Big Stories

×