BigTV English

This Week theater Releases: ఈ వారం థియేటర్లో చిన్న సినిమాలదే హవా.. ఒకే రోజు ఎన్ని సినిమాలంటే..?

This Week theater Releases: ఈ వారం థియేటర్లో చిన్న సినిమాలదే హవా.. ఒకే రోజు ఎన్ని సినిమాలంటే..?

Movies releasing this week in theatres in Telugu: ఈ ఏడాది సంక్రాంతి నుంచి థియేటర్లలో బడా హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద హంగామా చేశాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, తేజాసజ్జ హనుమాన్, నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్‌తో పాటు రీసెంట్‌గా విడుదలైన సందీప్ కిషన్ ఊరుపేరు భైరవకోన సినిమాలు జనవరి నుంచి మొదలుకొని ఫిబ్రవరి వరకు థియేటర్లలో సందడి చేశాయి.


ఇక ఫిబ్రవరి మూడో వారం అనగా.. ఈ శుక్రవారం థియేటర్లలో ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాకపోవడం విశేషం. దీంతో పెద్ద హీరోల సినిమాలు ఏవీ లేకపోవడంతో చిన్న సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఈ వారం బాక్సాఫీసు వద్ద పోటీపడుతున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

సుందరం మాస్టర్:


వైవా హర్ష ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘సుందరం మాస్టర్’. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో హర్షకు జోడీగా దివ్య శ్రీపాద హీరోయిన్‌గా నటిస్తోంది. సుధీర్ కుమార్ కుర్రుతో కలిసి మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

READ MORE: తండ్రి కాబోతున్న స్టార్‌ హీరో.. సమంత విషెస్‌

మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..:

టాలీవుడ్ కమెడియన్ అభినవ్ గోమఠం హీరోగా తిరుపతి రావు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కూడా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సిద్దార్థ్‌ రాయ్‌:

దీపక్ సరోజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సిద్దార్థ్ రాయ్’. ఈ హీరో ‘అతడు’ మూవీలో బ్రహ్మానందం కొడుకుగా దీపక్ చేశాడు. ఇప్పుడు ఏకంగా హీరోగా పరిచయం కాబోతున్నాడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్, విహిన్ క్రియేషన్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జయ అడపాక ఈ సినిమాకి నిర్మాతగా ఉన్నారు. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

READ MORE: దర్శకుడు శంకర్‌ కుమార్తె నిశ్చితార్థం.. ఆ అసిస్టెంట్ డైరెక్టరే వరుడు..

ముఖ్య గమనిక:

అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘ముఖ్య గమనిక’. శివిన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజశేఖర్, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు మురళీధర్ దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×