BigTV English

Pawan Kalyan: డిప్యూటీ సీఎంను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు.. ?

Pawan Kalyan: డిప్యూటీ సీఎంను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు.. ?

Pawan Kalyan: పదేళ్ల తరువాత హీరో పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సమ్మె గా మారారు. ఆయన విజయాన్ని అభిమానులే కాదు. టాలీవుడ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. పవన్ సైతం ఎవరి పొగడ్తలకు పారిపోకుండా తాను నమ్మిన సిద్దాంతం కోసం కష్టపడుతున్నారు. ఇక ఇప్పటికే కూటమి విజయం సాధించిన సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా టాలీవుడ్ మొత్తానికి పార్టీ ఇస్తున్న విషయం తెల్సిందే.


జూన్ 23 న హైదరాబాద్ లోని సంధ్యా కన్వేషన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. అంటే ఈరోజే.. మరి కొద్దిసేపటిలో ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ లోని అన్ని ప్రొడక్షన్ హౌసెస్ తో పాటు హీరోలు కూడా అటెండ్ కానున్నారు. దీని తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను  టాలీవుడ్ నిర్మాతలు భేటీ కానున్నారని తెలుస్తోంది.

విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ ను.. టాలీవుడ్ నిర్మాతలు అయిన అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ,రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల,తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు,దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు కలిసి ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలపనున్నారట.


అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరనున్నారని సమాచారం. గతంలో జగన్ గెలిచినప్పుడు కూడా టాలీవుడ్ నిర్మాతలు ఇలానే ఇండస్ట్రీ సమస్యలను ఏకరువు పెట్టారు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికి తెల్సిందే. ఇప్పుడు టాలీవుడ్ మొత్తం పవన్ నే నమ్ముకుంది. మరి ఈసారి ఇండస్ట్రీ సమస్యలపై పవన్ ఎలాంటి పరిష్కారం చూపుతాడో చూడాలి.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×