Sridevi: ఇటీవల కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్కరు కూడా వారిలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ ఎన్నో అవకాశాలను అందుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్తవాళ్లు సోషల్ మీడియాను ఒక వేదికగా చేసుకొని సినిమా అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా యూట్యూబ్ ఛానల్స్ ఇంస్టాగ్రామ్, రీల్స్ ద్వారా ఎంతోమంది సినిమాలలో నటించే అవకాశాలను అందుకొని వెండితెరపై కూడా సక్సెస్ అందుకుంటున్నారు. ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో కోర్ట్ (Court)సినిమా నటి శ్రీదేవి ఒకరు.
మొదటి సినిమాతోనే సక్సెస్..
శ్రీదేవి(Sridevi) మన తెలుగు అమ్మాయే అనే సంగతి మనకు తెలిసిందే. ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను, రీల్స్ షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిన ఈమెకు నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్టు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో జాబిలి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఒక్క సినిమాతోనే ఎంతో ఫేమస్ అయిన శ్రీదేవి ప్రస్తుతం పలు సినిమా కథలను వింటూ ఉన్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
నా రీల్స్ అంటే చాలా ఇష్టం…
కోర్టు సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న శ్రీదేవికి చిరంజీవి లాంటి స్టార్ హీరోల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న డైరెక్టర్ గోపిచంద్ మలినేని(Gopichand Malineni), హరీష్ శంకర్ (Harish Shankar)ఈ ఇద్దరు దర్శకులు శ్రీదేవిని కలిసారని తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని ఈమె తెలియజేస్తూ గోపీచంద్ మలినేని గారికి నేను చేసే రీల్స్ అంటే చాలా ఇష్టమని ఆయన స్వయంగా తెలిపినట్టు వెల్లడించారు. ఈ దర్శకులు ఇద్దరు తనని కలిసారని, అయితే వాళ్లు ప్రస్తుతం చేస్తున్న సినిమాల కోసం నన్ను కలవలేదని కానీ ఇండస్ట్రీలో నేను మరింత ఎదిగే వరకు మేము వెయిట్ చేస్తామని చెప్పినట్టు శ్రీదేవి వెల్లడించారు.
"Director #GopichandMalineni approached me, saying he liked my reels. Later, #HarishShankar garu also reached out — not for any immediate projects, but they're waiting for me to grow."
– Sridevi, #COURT Fame ✨ pic.twitter.com/Svn3NvZsXB
— Movies4u Official (@Movies4u_Officl) June 4, 2025
ఇక కోర్టు సినిమా విషయానికి వస్తే… నాని వాల్ పోస్టర్ పతాకంపై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సమయానికి ఏకంగా 58 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రోహిణి, శివాజీ, సాయికుమార్, శుభ సుధాకర్, హర్షవర్ధన్, హర్ష రోషన్, ప్రియదర్శిని వంటి వారు కీలక పాత్రలలో నటించారు.