BigTV English

Prabhas Hanu: ప్రభాస్, హను సినిమాకు ఓ రేంజ్‌లో హైప్.. ఓవర్సీస్ కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్?

Prabhas Hanu: ప్రభాస్, హను సినిమాకు ఓ రేంజ్‌లో హైప్.. ఓవర్సీస్ కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్?

Prabhas Hanu Movie: తెలుగు హీరో అయిన ప్రభాస్‌కు ప్యాన్ ఇండియా స్టార్ ట్యాగ్ రావడంతో తన సినిమాల విషయంలో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రభాస్.. ఒక సినిమాలో నటించాడంటే అది హిట్ అయినా.. ఫ్లాప్ అయినా.. కలెక్షన్స్ మాత్రం కచ్చితంగా ఒక రేంజ్‌లో వస్తాయని గ్యారెంటీ. అలాంటిది ఒక బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన దర్శకుడితో కలిసి ప్రభాస్ సినిమా చేస్తున్నాడంటే కచ్చితంగా దాని డిమాండ్ ఆకాశాన్ని తాకుతుంది. ఇప్పుడు ప్రభాస్ (Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే ఓవర్సీస్ రైట్స్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.


ప్రేమకథల స్పెషలిస్ట్

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పటినుండి ప్రభాస్ దగ్గర నుండి ఎక్కువగా కమర్షియల్ సినిమాలనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందుకే ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘రాధే శ్యామ’ డిశాస్టర్ అయ్యింది. అయినా కూడా మరోసారి ప్రేమకథతో ప్రయోగం చేయడానికి ప్రభాస్ సిద్ధమయ్యాడు. లవ్ స్టోరీలను తెరకెక్కించడం, వాటితో ప్రేక్షకులను ఫిదా చేయడంలో హను రాఘవపూడి స్పెషలిస్ట్. అలాంటి దర్శకుడితో ప్రభాస్.. మరోసారి ప్రేమకథతో ప్రయోగం చేయడానికి సిద్ధపడ్డాడు. అసలు ఈ మూవీ ఎలా ఉంటుందో తెలియకముందే నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌కు దీనిపై నమ్మకం వచ్చేసింది.


Also Read: డార్లింగ్ లైఫ్ పై డాక్యుమెంటరీ… నిర్మాతలకు ప్రభాస్ షాకింగ్ రూల్

ఓవర్సీస్ రైట్స్ కోసం

మామూలుగా ఒక సినిమాకు ఎంత సూపర్ హిట్ టాక్ లభించినా.. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం అనేది కష్టమైన విషయమే. అలాంటిది ప్రభాస్, హను రాఘవపూడి సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే కేవలం ఓవర్సీస్ రైట్స్ కోసమే రూ.108 కోట్లు డిమాండ్ చేస్తున్నారట మైత్రీ మూవీ మేకర్స్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ప్రభాస్, హను చిత్రానికి కేవలం కథ మాత్రమే సిద్ధంగా ఉంది. అంతే కాకుండా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇంకా పూర్తికాలేదు. ఇంతలోనే ఓవర్సీస్‌ రైట్స్ కోసం నిర్మాతలు రూ.100 కోట్లు డిమాండ్ చేయడం ఇండస్ట్రీ నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

మరో రికార్డ్ రెడీ

ప్రభాస్, హను రాఘవపూడి సినిమాకు ఈ రేంజ్‌లో హైప్ క్రియేట్ అవ్వడానికి మరొక బలమైన కారణం కూడా ఉంది. అదే హను చివరి చిత్రం ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ఒక రేంజ్‌లో కలెక్షన్స్ సాధించింది. అంతే కాకుండా.. ‘సీతారామం’కు అసలు ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాలేదు. దీంతో మైత్రీ మూవీ మేకర్స్.. ఓవర్సీస్ రైట్స్ కోసం రూ.100 కోట్లను డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. కానీ బయర్స్ మాత్రం రూ.80 కోట్లతో సినిమాను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారట. ఇదే నిజమయితే.. ఓవర్సీస్‌లో ప్రభాస్ పేరు మీద ఒక రికార్డ్ క్రియేట్ అయినట్టే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×