BigTV English

Jerry in Chicken Biryani: బిర్యానీలో ప్రత్యక్షమైన జెర్రీ.. కంగుతిన్న కస్టమర్.. ఇదేంటని హోటల్ సిబ్బందిని అడిగితే…

Jerry in Chicken Biryani: బిర్యానీలో ప్రత్యక్షమైన జెర్రీ.. కంగుతిన్న కస్టమర్.. ఇదేంటని హోటల్ సిబ్బందిని అడిగితే…

Customer Shocked after noticed Jerry in Chicken Biryani: ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు పెట్టినా.. ఎన్ని చర్యలు తీసుకున్నా కొంతమంది హోటల్ నిర్వాహకులు తీరు మారడంలేదు. లాభాపేక్షే ధ్యేయంగా ముందుకెళ్తూ కస్టమర్లు ఏమైతే మాకేంటి అన్న చందంగా బిహేవ్ చేస్తున్నారు. రేట్లు మాత్రం ఇష్టానుసారంగా వసూలు చేస్తూ కస్టమర్ల నుంచి దండుకుంటున్నారు. కానీ, జాగ్రత్తలు తీసుకోవడం, నాణ్యమైన ఆహారం అందిచడంలో విఫలమైతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఆహారంలో నాణ్యత లోపిస్తున్నది. ఇది ఒక అంశమైతే.. మరో బిత్తెరపోయే అంశం ఏమంటే… వారు సెర్వ్ చేసే పుడ్ లో ప్లాస్టిక్ వైర్లు, ఎలుకలు, బల్లులు, పురుగులు ప్రత్యక్షమైతున్నాయి. ఇటువంటి ఘటనలు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చాలా హోటళ్లలో చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ లు కూడా సోషల్ మీడియాలో కూడా వైరలయ్యాయి. అయినా కూడా పలువురి హోటల్ నిర్వాహకుల్లో ఏ మాత్రం జాగ్రత్త కనిపించట్లేదు. ఇందుకు స్పష్టమైన ఉదాహరణే తాజాగా ఓ దారుణం చోటు చేసుకుంది. ఈ విషయం మీకు తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.


Also Read: తెలంగాణలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇదే మొదటిసారి: కిషన్ రెడ్డి

అదొక పెద్ద హోటల్. ఆ హోటల్ ఎక్కడో కాదు.. రాష్ట్ర రాజధానికి దగ్గరలో ఉన్న ఓ జిల్లా కేంద్రంలో ఉంది. నేషనల్ హైవేపై ఉంది ఆ హోటల్. హోటల్ బాగుంది కదా.. అని అందులోకి వెళ్లాడు ఆ కస్టమర్. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ చేసిన ఫుడ్ ను హోటల్ సిబ్బంది తెచ్చి ఇచ్చారు. వెంటనే అది కొంతవరకు తినేశాడు.. కస్టమర్. కానీ, అలా తింటున్న సమయంలో ఒక్కసారి ఆ ఫుడ్ లో కనిపించరానిది కనిపించింది. దీంతో కంగుతిన్నాడు. వెంటనే తినడం ఆపేసి.. అదేంటని తీసి చూశాడు. అప్పడు అర్థమైంది. అది జెర్రీ అని. వెంటనే ఆ సిబ్బందిని పిలిచి ప్రశ్నించాడు. ఇదేంటని అడిగితే.. సారీ సార్.. వెంటనే వేరే ఆర్డర్ తెచ్చిస్తామంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా అతను వదలకుండా సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేశాడు. అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కడుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి హోటల్స్ పై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.


పూర్తి వివరాల్లోకి వెళితే… రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు అతి దగ్గరలోనే ఉన్న భువనగరిలిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని నేషనల్ హైవేపై ఓ హోటల్ ఉంది. ఆ హైవే గుండా ప్రయాణం చేస్తున్న ఓ ప్రయాణికుడు ఆ హోటల్ కు వెళ్లాడు. వెంటనే చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. కొద్ది సమయం తరువాత సిబ్బంది వచ్చి అతను ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీని తెచ్చి ఇచ్చాడు. వెంటనే ఆ చికెన్ బిర్యానీని తినడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఆ చికెన్ బిర్యానీలో కాళ్ల జెర్రీ కనిపించింది. ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే తినడం ఆపేసి.. ఆ జెర్రీని బయటకు తీశాడు. దానిని టిష్యూ పేపర్ లో పెట్టి.. హోటల్ సిబ్బందిని పిలిచాడు. ఇదేంటని ప్రశ్నించగా.. వారికి విషయం అర్థమైపోయి తడబడ్డారు. మరోటి తెచ్చిస్తాం సార్ అంటూ మరిపించే ప్రయత్నాలు చేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ కస్టమర్.. వెంటనే హోటల్ యజమానిని పిలవాలని చెప్పాడు. ఇదంతా కూడా సంబంధిత అధికారులుకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. మీడియాకు కూడా ఈ వివరాలను తెలియజేస్తానని పేర్కొన్నాడు. ఆ తరువాత దానిని ఫోన్ లో వీడియో తీశాడు.

Also Read: తెలంగాణ ప్రజలకు భారీ అలర్ట్… రానున్న మూడు రోజులూ…

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో జెర్రీ స్పష్టంగా కనిపిస్తుంది. ప్లేటులో బిర్యానీ, చికెన్ ముక్కలు కూడా కనిపిస్తున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ సదరు హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Related News

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Big Stories

×