E-Paper
Advertisement

Tollywood Disaster Movies 2023 : 2023 లో టాలీవుడ్ బాక్సాఫీస్ డిజాస్టర్స్..

Tollywood Disaster Movies 2023  : 2023 లో టాలీవుడ్ బాక్సాఫీస్ డిజాస్టర్స్..
Advertisement
Tollywood Disaster Movies 2023

Tollywood Disaster Movies 2023 : 2023 దాదాపు పూర్తి కావస్తుంది .ఈ సంవత్సరం సినీ ప్రేక్షకులను ఆలరించడానికి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే అన్ని సినిమాలు ఊహించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయాయి .కొన్ని ఎటువంటి హైప్ లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్లుగా నిలిస్తే. మరికొన్ని భారీ అంచనాల మధ్య వచ్చి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ లిస్టులో చిన్న సినిమాలే కాదు పెద్ద హీరోల సినిమాలు కూడా ఉండడం విశేషం.మరి ఈ సంవత్సరం అలా బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా మిగిలిన సినిమాలేవో ఒక లుక్ వేద్దాం పదండి..

భోళా శంకర్

Advertisement

భారీ అంచనాల మధ్య విడుదలైన మెగాస్టార్ భోళాశంకర్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. డిజాస్టర్ డైరెక్టర్ అని తెలిసి కూడా మెహర్ రమేష్ తో ప్రయోగం చేసి మెగాస్టార్ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఫైనల్ గా చిరంజీవి కెరీర్ లోనే చూడనంత డిజాస్టర్ మూవీగా ఈ చిత్రం నిలిచిపోయింది.

ఆది పురుష్

Advertisement

మర్యాద పురుషోత్తముడు రాముడు జీవితాన్ని ఆధారంగా ..శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించిన మూవీ ఆది పురుష్.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎన్నో వివాదాల్లో ఇరుక్కోవడమే కాకుండా ప్రభాస్ కెరియర్ లోనే పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర చిత్రీకరణ దగ్గర నుంచి పలు సన్నివేశాల పై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఏజెంట్

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. మంచి సక్సెస్ కోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. ఎన్నో కసరత్తులు ..చేసి ఎంతో కష్టపడి ఏజెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కనివిని ఎరుగని రేంజ్ డిజాస్టర్ గా మిగిలింది.

అఖిల్ కెరీర్ ని మారుస్తుంది అనుకున్న సినిమా కాస్త.. అతని కెరియర్ని ప్రశ్నార్ధకంగా మార్చేసింది.

కస్టడీ

అక్కినేని నాగచైతన్య కూడా ఈ సంవత్సరం ఒకేసారి తెలుగు ..తమిళ్ భాషల్లో కస్టడీ అనే మూవీ తో వచ్చాడు. ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది.

టైగర్ నాగేశ్వరరావు

స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా వచ్చిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది.

స్కంద

భార్య అంచనాల మధ్య విడుదలైన రామ్ పోతినేని స్కంద మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం లో పూర్తిగా విఫలం అయ్యింది.

గాండీవధారి అర్జున

మెగాపిరి నుంచి నటించిన గాండీవ దారి అర్జున్..మూవీ..విడుదలకు ముందు బజ్ ను క్రియేట్‌ చేసి..తర్వాత ఎప్పుడు థియేటర్లోకి వచ్చిందో.. ఎప్పుడు వెళ్ళిందో కూడా అర్థం కానంత ఫాస్ట్గా వచ్చి వెళ్ళిపోయింది. ఈ మూవీ ఓ రెంజ్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×