
Transformers : హాలీవుడ్‌లోని సెన్సేషనల్ ఫ్రాంచైజ్‌లలో ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఒకటి. ఈ సిరీస్‌లో లేటెస్ట్‌గా వచ్చిన సినిమానే ‘ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్’. ఇందులో ఉన్న బీస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా దానిపై ఉన్న సీక్వెన్స్‌లు మంచి విజువల్ ట్రీట్ ఇస్తాయి.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది.
కథ..
యూనికాన్ అనే ఓ డార్క్ డెవిల్ స్పేస్‌లో కాలం గుండా ప్రయాణించే ఓ ట్రాన్స్ వార్ప్ కీ కావాలని కోరుకుంటాడు. అయితే, ఈ కీ ని భూమిపై మాగ్జిమల్స్ అనే కొన్ని రోబోటిక్ బీస్ట్ ట్రాన్స్ఫార్మర్ కొన్ని భాగాలుగా విభజించి దాచి కాపాడుతూ ఉంటాయి. మరి ఈ కీ కోసం యూనికాన్ ఏం చేస్తాడు? సంపాదిస్తాడా లేదా? అసలు ఇంకెవరైనా ఈ కీ కోసం వెతుకుతున్నారా? అనేవి తెలియాలంటే ఈ సినిమాను వెంటనే చూసేయండి.
ఎలా ఉందంటే?
ఈ సిరీస్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను వినూత్నంగా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆప్టిమస్ ప్రైమ్‌పై సీక్వెన్స్‌లు బాగుంటాయి. ఇక వీటితోపాటు సినిమాలో స్టన్నింగ్ విజువల్స్, స్లో మోషన్స్ సహా బాక్గ్రౌండ్ మ్యూజిక్ మిక్సింగ్ కూడా ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది. కొత్త పాయింట్ లేకపోయినా మేకింగ్‌పై పెట్టిన ఎఫర్ట్ వల్ల సినిమా ముందు వరుసలో నిలబడుతుంది. ఈ వీకెండ్ చూడొచ్చు.