BigTV English

Tripti Dimri: భారీగా రెమ్యునరేషన్ పెంచిన యానిమల్ బ్యూటీ..ఎంతంటే?

Tripti Dimri: భారీగా రెమ్యునరేషన్ పెంచిన యానిమల్ బ్యూటీ..ఎంతంటే?

Tripti Dimri Remuneration: గతేడాది విడుదలైన యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ మూవీతో ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయింది త్రిప్తి డిమ్రి. ఈ సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నా త్రిప్తి డిమ్రికి మాత్రం క్రేజీ తగ్గడం లేదు. రణ్‌భీర్ కపూర్, త్రిప్తి డిమ్రి ఇంటిమేట్ సీన్స్ మూవీ లవర్స్‌కు ఇంకా కళ్ల ముందు కదులుతున్నాయి. దీంతో ఈ బ్యూటీపై గాసిప్స్, ట్రోల్స్ తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ట్రెండింగ్‌లో ఉండడంతో పాటు సోషల్ మీడియాలోనూ క్రేజీ సంపాదించుకుంది.


2017లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రి ఇచ్చిన ఈ అమ్మడు..ఏడేళ్లలో కేవలం ఐదారు సినిమాలు చేసినా అంతగా క్రేజీ తెచ్చుకోలేదు. కానీ గతేడాది వచ్చిన యానిమల్ సినిమాతో త్రిప్తి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మికకు ధీటుగా త్రిప్తి క్రేజీ సొంతం చేసుకుంది. అయితే యానిమాల్ సినిమాకు ముందు ఈ బ్యూటీ రూ.20 నుంచి రూ.25 లక్షల రెమ్యునరేషన్ మాత్రమే ఉండగా.. యానిమాల్ సినిమాకు మాత్రం రూ.40 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. ఈ సినిమాతో పాపులారిటీ రావడంతో ఒక్కసారిగా రెమ్యునరేషన్ డబుల్ చేసిందని వార్తలు వస్తున్నాయి.

యానిమల్ సినిమాతో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ త్రిప్తి రేంజ్ మారిపోయింది. ఇక రెమ్యునరేషన్ విషయంలో త్రిప్తి టాప్ లేపేస్తుంది. ఇటీవల వచ్చిన బ్యాడ్ న్యూజ్ సినిమాలో నటించిన త్రిప్తి..ఏకంగా డబుల్ రెమ్యునరేషన్ అంటే దాదాపు రూ.80 లక్షల వరకు డిమాండ్ చేసిందని సమాచారం. అంతేకాదు, రానున్న సినిమాల్లోనూ యానిమల్ బ్యూటీ..రూ.కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది.


Also Read: ఆయన నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదు.. రవితేజ సెన్సేషనల్ కామెంట్స్

ఇదిలా ఉండగా, ప్రస్తుతం త్రిప్తి.. వీవీవీ వీడియో, భూ భూలియ 2, దఢక్ 2 సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాల కోసం త్రిప్తి అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక, ఈ బ్యూటీ సినిమాలో ఉంటే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే రేంజ్ లో రెచ్చిపోతుంది. అందుకేనేమో త్రిప్తికి అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చి మరి ఆపర్ ఇస్తున్నారు. యానిమల్ సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకున్న త్రిప్తికి సౌత్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయని టాక్. ఎక్కువగా టాలీవుడ్ నుంచి వచ్చినట్లు చెబుతున్నా ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×