Ravi Teja new movie update(Latest news in tollywood): మాస్ మహారాజా రవితేజ- హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం మిస్టర్ బచ్చన్. మిరపకాయ్, షాక్ లాంటి సినిమాల తరువాత ఈ కాంబో మిస్టర్ బచ్చన్ సినిమాతో వస్తుండడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. హిందీలో హిట్ అయిన రైడ్ సినిమా లైన్ తీసుకొని.. ఈ సినిమాను హరీష్ శంకర్ తెరకెక్కించాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజ్ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. నేడు కర్నూల్ లో మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఇక ఈ ఈవెంట్ లో రవితేజ చిత్ర బృందానికి థాంక్స్ చెప్పాడు. కర్నూల్ రావడం చాలా ఆనందంగా ఉందని, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్ లో కావాలనే పెట్టించినట్లు రవితేజ తెలిపాడు. ఇక ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారని, ఆగస్టు 14 సాయంత్రం నుంచే ఈ సినిమా ప్రీమియర్లతో మొదలుకానుందని చెప్పుకొచ్చాడు. భాగ్యశ్రీ మామూలుగానే అందంగా ఉంటుంది. ఈ సినిమాలో ఇంకా అందంగా చూపించారు.. ఆమెకు మంచి మంచి అవకాశాలు వస్తాయని తెలిపాడు.
ఇక ఈ సినిమాకు మెయిన్ హీరో మిక్కీ జె మేయర్. అసలు ఆయన నుంచి ఇలాంటి మ్యూజిక్ ను ఊహించలేదు. నేనే కాదు.. మీరు కూడా ఊహించలేదు కదా అని చెప్పుకొచ్చాడు. ఇక హరీష్ శంకర్ గురించి ఎన్ని చెప్పాలి.. ఏమని చెప్పాలి. మేము ఇద్దరం ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే మనకు మనమే ఎలివేషన్స్ ఇచ్చుకున్నట్లు అవుతుంది. ఆగస్టు 14 సాయంత్రం ఇరగదీయబోతున్నాం అని చెప్పుకొచ్చాడు.