BigTV English

VD12 : విజయ్‌ దేవరకొండ మూవీ నుంచి శ్రీలీల అవుట్..? త్రిప్తి డిమ్రికి ఛాన్స్..!

VD12 : విజయ్‌ దేవరకొండ మూవీ నుంచి శ్రీలీల అవుట్..? త్రిప్తి డిమ్రికి ఛాన్స్..!

VD12 : విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే అయ్యింది. గతేడాది శ్రీలీల హీరోయిన్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి పక్కకు తప్పుకున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. శ్రీలీల స్థానంలో బాలీవుడ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ త్రిప్తి డిమ్రిని కథానాయికగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చిత్రబృందం ఇప్పటికే ఆమెను సంప్రదించిందని సమాచారం. ఈ మూవీలో నటించేందుకు ఆమె కూడా పచ్చజెండా ఊపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు “సప్త సాగరాలు దాటి” మూవీ ఫేమ్ రుక్మిణీ వసంత్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ కథనాలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు.


ఇది విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 12వ సినిమా. ఈ చిత్రం VD12గా ప్రచారంలో ఉంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌ నిర్మిస్తున్నాయి. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు. మార్చి నుంచి షూట్‌ రెగ్యులర్‌ గా మొదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన త్రిప్తి డిమ్రి.. ‘యానిమల్‌’తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఆ చిత్రంలో రష్మిక కన్నా త్రిప్తి ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ యాక్షన్‌ డ్రామా చిత్రంతో త్రిప్తి యువ హృదయాలను కొల్లగొట్టింది.

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో వరసగా విజయ్ దేవరకొండ సూపర్ హిట్లు అందుకున్నాడు. ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. దీంతో ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ ప్రాజెక్టులపైనే పెట్టుకున్నాడు.


Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×