BigTV English

Thailand Ram Mandir | థాయ్‌లాండ్‌లో అయోధ్య ఉత్సవాలు.. అయుత్తయ్య నగరంలో మార్మోగుతున్న రామ భజనలు

Thailand Ram Mandir | అయోధ్యలో భగవాన్ శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకలకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న ఈ కార్యక్రమం జరుగనుంది. దేశమంతా ఈ వేడుక కారణంగా పండుగ వాతావరణం నెలకొంది.

Thailand Ram Mandir | థాయ్‌లాండ్‌లో అయోధ్య ఉత్సవాలు.. అయుత్తయ్య నగరంలో మార్మోగుతున్న రామ భజనలు

Thailand Ram Mandir | అయోధ్యలో భగవాన్ శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకలకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న ఈ కార్యక్రమం జరుగనుంది. దేశమంతా ఈ వేడుక కారణంగా పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ పండుగ వాతావరణం భారత దేశంతో పాటు ప్రపంచమంతా నివసించే హిందువుల్లో కనిపిస్తోంది.ముఖ్యంగా దక్షిణ తూర్పు దేశమైన థాయ్‌ల్యాండ్‌లో కూడా అయోధ్యలో జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకను పండుగలా జరుపుకుంటున్నారు.


థాయ్‌లాండ్‌లోని అయుత్తయ్య నగరం నుంచి అక్కడి మట్టి, మూడు నదుల పవిత్ర జలం భారతదేశంలోని అయోధ్య నగరానికి చేరుకున్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరం విషయమేమిటంటే భారతదేశంలోని అయోధ్య నగరం పేరునే థాయ్‌లాండ్‌లో అయుత్తయ్య నగరం పేరు పెట్టారు. థాయ్‌లాండ్‌ దేశానికి భారత భూగంతో సరిహద్దులు లేప్పటికీ అక్కడి ప్రజలు భగవాన్ శ్రీ రాముడిని ఆరాధిస్తారు. రామాయణ కథని వాళ్లు ఇప్పటికీ తమకు ఆదర్శమని చెబుతారు.

థాయ్‌లాండ్‌ చరిత్రలో అయుత్తయ్య నగరానికి రాజు అయిన రాజా రామ్‌తిబోడీ పరమ రామభక్తుడు. ఆయనే తన నగరానికి అయుత్తయ్య అని నామకరణం చేశారు.ఈ నగరం థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంగ్ కాక్ నగరానికి ఉత్తర దిశలో 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయుత్తయ్య నగరానికి యునెస్కో సాంస్కృతిక గుర్తింపు ఉంది.


జనవరి 22న భారతదేశంలో అయోధ్య వేడుక జరుగుతుండగా.. ఆ వేడుకని థాయ్‌లాండ్‌లోని అన్ని నగరాల్లో విశ్వ హిందూ పరిషద్ ఆధ్వర్యంలో పెద్ద స్క్రీన్లపై డైరెక్ట్ టెలికాస్ట చేయనున్నారు. ముఖ్యంగా నగరాల్లోని దేవాలయల ఎదుట ఈ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ అన్ని దేవాలయాలను దీపాలతో అలంకరించనున్నారు. ఆ రోజంతా శ్రీ రాముడిని స్తుతిస్తూ భజన కార్యక్రమాలు జరుగుతాయి.

Thailand, Ram Mandir, Ayodhya, Consecration, celebrations, Ayutayya city,

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×