IND Pak War: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట జరుగుతున్న ఈ యుద్ధం పై ఇప్పటికే పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్ – పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల వేళ జమ్మూలో విధులు నిర్వహిస్తున్న తన తండ్రి కోసం ప్రముఖ కమెడియన్ సమయ్ రైనా (Samayraina) ఆందోళన వ్యక్తం చేస్తూ చేసిన పోస్టు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా ఆయన తన పోస్ట్ ద్వారా..” నాన్న రాత్రి జమ్మూ నుంచి చివరిసారిగా నాకు ఫోన్ చేసి శుభరాత్రి చెప్పారు. నన్ను నిద్రపొమ్మని, చింతించవద్దు అని తెలిపారు. భారత సాయుధ దళాలు ప్రతీది అదుపులో ఉంచాయని చెప్పారు” అంటూ సమయ్ రైనా తన పోస్టులో తెలిపారు. ప్రస్తుతం సమయ్ రైనా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సమయ్ రైనా కెరియర్..
కమెడియన్ గా కెరియర్ మొదలుపెట్టిన సమయ్ రైనా.. 2019లో జరిగిన స్టాండ్ కామెడీ షో కామిక్ స్టాన్ -2 సహ విజేత కూడా. ఇక 2024 నుండి కామెడీ టాలెంట్ షో అయిన ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈయన బాల్యం విషయానికి.. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ నగరంలో ఒక సాంప్రదాయవాద కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు. మహారాష్ట్రలోని పూణేలో విద్యార్థి గృహ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ప్రింట్ ఇంజనీరింగ్ కోర్సులో చేరిన రైనా.. ఆ సమయాన్ని వృధా అని కూడా చెప్పాడు. ఆ తర్వాత ఓపెన్ మైక్ ఈవెంట్లు చేయడం ప్రారంభించిన ఈయన.. చివరికి స్టాండ్ అప్ కమెడియన్ గా మంచి పేరు సొంతం చేసుకున్నారు.
also read; Bollywood Actress: సింగిల్ పేరెంట్.. డోంట్ కేర్.. ఆదర్శంగా నిలిచిన మాతృమూర్తులు ..!
కమెడియన్ మాత్రమే కాదు యూట్యూబర్ కూడా..
ఇకపోతే ఈయన కమెడియన్ మాత్రమే కాదు యూట్యూబర్ కూడా.. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ప్రభుత్వం అన్ని బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసింది. దాంతో తన స్టాండ్ అప్ కామెడీని రైనా ప్రదర్శించలేకపోయాడు. ఆ తర్వాత తన తోటి హాస్యనటుడైన తన్మయ్ భట్ సలహా మేరకు యూట్యూబర్ ‘ఆంటోనియో రాడిక్’ పేరిట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. ఇక అక్కడ తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా అలరించి, ఫాలోవర్స్ ను పెంచుకున్నాడు. ఈయన టాలెంట్ ని చూసి భారత జిఎం విదిత్ గుజరాతి తన ట్రాక్ లో రైనాతో చేరాలనుకుంటున్నట్లు ట్వీట్ చేయగా చివరికి గుజరాతీ కూడా రైనా యూట్యూబ్ ఛానల్లో కనిపించాడు. ఇక అప్పటినుంచి వీరిద్దరూ బలమైన కంటెంట్ ను ఇస్తూ ఫాలోవర్స్ ను పెంచుకున్నారు. ఇక అంతే కాదు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పేదవారికి సహాయం చేస్తూ.. విరాళాలు స్వీకరిస్తూ కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మరింత పాపులర్ సొంతం చేసుకున్నారు.