BigTV English
Advertisement

Trisha: 14 ఏళ్ల తరువాత అక్కడ రీఎంట్రీ.. హిట్ అందేనా.. ?

Trisha: 14 ఏళ్ల తరువాత అక్కడ రీఎంట్రీ.. హిట్ అందేనా.. ?

Trisha: అందం, అభినయం కలబోసిన రూపం త్రిష కృష్ణన్. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ చెన్నై సోయగం ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇక తాజాగా ఈ చిన్నది.. ఈ మధ్యనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యిన విషయం తెల్సిందే.


మెగాస్టార్ చిరంజీవి తో 18 ఏళ్ళ క్రితం స్టాలిన్ సినిమాలో నటించిన త్రిష.. ఇప్పుడు విశ్వంభర సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇది కాకుండా తమిళ్ లో మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే.. ఈ చిన్నది హిందీలో కూడా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యిందని టాక్ నడుస్తోంది.

14 ఏళ్ల క్రితం కట్టామిట్టా అనే సినిమాతో హిందీలో అడుగుపెట్టింది త్రిష. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సరసన నటించినా కూడా అమ్మడికి ఆశించిన ఫలితం దక్కలేదు. ఆ తరువాత అవకాశాలు కూడా అందలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక ఇప్పుడు కూడా మరో స్టార్ హీరో సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వబోతుందంట. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రాల్లో ది బుల్ ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేసారని వార్తలు వినిపిస్తున్నాయి.


విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే విష్ణు వర్ధన్ కూడా తమిళ దర్శకుడే కాబట్టి త్రిషను తీసుకున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేహ్వరకు ఆగాల్సిందే.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×