BigTV English

Ramdas Athawale: ప్రైయివేట్ రంగ రిజర్వేషన్లపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Ramdas Athawale: ప్రైయివేట్ రంగ రిజర్వేషన్లపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Ramdas Athawale: కేంద్రమంత్రి రామ్ దాస్ అఠావలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రయివేటు సెక్టార్‌లోని ఉద్యోగాలకు కూడా ఓబీసీ, ఇతర వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. అంతే కాకుండా రిజర్వేషన్ కల్పన విషయంలో భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తోందని అన్నారు.


ప్రయివేటు రంగ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలని కర్నాటక తీసుకున్న నిర్ణయం పెను దుమారం రేపింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రయివేటు కోటాపై కేంద్రమంత్రి రాందాస్ అఠావలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన యువత చాలా మంది ప్రయివేటు ఉద్యోగాల కోసం చూస్తున్నారని, కానీ ప్రయివేటు ఉద్యోగాల్లో ఎలాంటి రిజర్వేషన్ లేదని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రయివేటు రంగంలోకి మారే అవకాశం ఉందన్నారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని తమ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోందని ఆయన పేర్కొన్నారు. జనరల్ క్యాటగిరీ అభ్యర్థులను తాము వ్యతిరేకించడం లేదన్నారు.

ప్రయివేట్ సంస్థల్లో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు 50 శాతం, నాన్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో 75 శాతం కన్నడిగులకు అవకాశం కల్పించాలనే బిల్లుకు సోమవారం కర్నాటక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కంపెనీలు రాష్ట్రాన్ని వీడి వెళ్లవచ్చని పరిశ్రమ సంస్థ నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.


Also Read: బీజేపీలో కుర్చీ కోసం కొట్లాట: అఖిలేష్ యాదవ్

ప్రయివేట్ కోటాపై కన్వెస్టర్లు కలత చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. పెట్టుబడి దారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇన్వెస్టర్లు కర్ణాటకకు రావాలని మేం కోరుకుంటున్నాం అని డీకే శివ కుమార్ అన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన నైపుణ్యం కలిగిన అభ్యర్థులు కర్ణాటకలో పని చేసేందుకు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కంపెనీలు రాష్ట్రాన్ని వీడి వెల్లవచ్చని పరిశ్రమల సంస్థ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం ప్రైవేట్ సంస్థలు కలత చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పెట్టుబడిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అదసరం లేదన్నారు.

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×