BigTV English

Trivikram : మూడో సినిమా.. గురూజీ సెంటిమెంట్‌

Trivikram : మూడో సినిమా.. గురూజీ సెంటిమెంట్‌


Trivikram : టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో త్రివిక్ర‌మ్ ఒక‌రు. సాధార‌ణంగా త్రివిక్ర‌మ్ సినిమా టైటిల్ విష‌యంలో ఓ సెంటిమెంట్ ఫాలో అవుతుంటార‌నే సంగ‌తి అంద‌రికీ విదిత‌మే. అయితే ఈయ‌న మ‌రో సెంటిమెంట్‌ను కూడా ఫాలో అవుతున్నారు. మ‌రి ఆ సెంటిమెంట్‌ను తెలిసి ఫాలో అవుతున్నారో లేక అలా సెట్ అయ్యిందో ఏమో కానీ.. సునిశితంగా గ‌మ‌నిస్తే ఆశ్య‌ర్య‌పోకుండా ఉండ‌లేం. ఇంత‌కీ మ‌న మాట‌ల మాంత్రికుడు ఫాలో అవుతున్న కొత్త సెంటిమెంట్ ఏంట‌నే వివ‌రాల్లోకి వెళితే.. స్టార్ హీరోల‌తో త్రివిక్ర‌మ్ చేసే హ్యాట్రిక్ సినిమాల విష‌యంలో ఓ సెంటిమెంట్ ఉంది. అదే సంక్రాంతి రిలీజ్ సెంటిమెంట్‌..

అస‌లు త్రివిక్ర‌మ్ ఫాలో అవుతున్న ఈ కొత్త సంక్రాంతి రిలీజ్ సెంటిమెంట్ గురించి తెలుసుకోవాలంటే పూర్తి వివ‌రాల‌ను ప‌రిశీలించాల్సిందే. స్టార్ హీరోల‌తో సినిమాలు చేసే గురూజీ ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు స్టార్స్‌తో హ్యాట్రిక్ మూవీస్ చేశారు. వారిలో ముందుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యానికి వ‌స్తే.. త్రివిక్ర‌మ్‌తో ఈయ‌న చేసిన మూడో సినిమా అజ్ఞాత‌వాసి. ఈ మూవీ 2018 సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వ‌చ్చిన ఇది ఆశించిన స్థాయిలో స‌క్సెస్ సాధించ‌లేద‌నుకోండి. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. త్రివిక్ర‌మ్‌తో మూడు సినిమాలు చేసిన మ‌రో హీరో అల్లు అర్జున్‌. వీరిద్ద‌రు క‌లిసి చేసిన మూడో చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో. 2020 సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించింది.


ఇప్పుడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ విష‌యంలోనూ అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నార‌ట త్రివిక్ర‌మ్‌. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌తో త్రివిక్ర‌మ్ చేస్తోన్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న రిలీజ్ కానుంది. అద‌న్న‌మాట గురూజీ త‌న‌కు తెలియ‌కుండానే ఫాలో అయిపోతున్న కొత్త సెంటిమెంట్‌. గుంటూరు కారం సినిమా విష‌యానికి వ‌స్తే రీసెంట్‌గా రిలీజైన గ్లింప్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్గా న‌టిస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×