BigTV English

Trivikram: పవన్ కు సలహాదారుడిగా త్రివిక్రమ్.. ఇకపై సినిమాలకు గుడ్ బై..?

Trivikram: పవన్ కు సలహాదారుడిగా త్రివిక్రమ్.. ఇకపై సినిమాలకు గుడ్ బై..?

Trivikram: ఏపీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చేశాయి. పదేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఇండస్ట్రీ మొత్తం సంబరాలు చేసుకుంటుంది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ఈ గెలుపు వలన ఇండస్ట్రీలో పరిస్థితిలు మారబోతున్నాయా.. ? అనేది ప్రస్తుతం అందరిని తొలుస్తున్న ప్రశ్న. అయితే ఇండస్ట్రీ మారుతుందో.. లేదో తెలియదు కానీ.. పవన్ గెలవడం వలన త్రివిక్రమ్ లైఫ్ మారిపోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


సినిమాల్లోనే కాదు .. రాజకీయ స్పీచ్ లలోనూ త్రివిక్రమ్ డైలాగ్స్ పవన్ కు బాగా పనికి వచ్చాయి. పవన్ విజయంలో కొద్దిలో కొద్దిగా త్రివిక్రమ్ సహాయసహకారాలు కూడా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. కాకపోతే త్రివిక్రమ్ ఎప్పుడు బయటపడలేదు అంతే తేడా. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. పవన్ గెలిచినందుకు త్రివిక్రమ్ ఆనందంలో మునిగితేలుతున్నట్లు తెలుస్తోంది.

పవన్ విజయాన్ని ఎప్పుడు కోరుకొనే త్రివిక్రమ్ .. ఆయన గెలిచాకా సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలను ఫినిష్ చేసి.. శాశ్వతంగా సినిమాల నుంచి తప్పుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. సినిమాలు చేయకుండా ఏం చేస్తాడు అని అంటే.. పవన్ కు, టీడీపీ పార్టీకి సలహాదారుడిగా పనిచేయనున్నాడని టాక్.


సినిమాల కంటే.. ఈ ఐదేళ్లలో పార్టీకి సపోర్ట్ చేస్తే అంతకంటే ఎక్కువనే సంపాదించవచ్చు అనే ఉద్దేశ్యంతో ఈ పని చేస్తున్నాడని, త్రివిక్రమ్ అడిగితే పవన్ కాదు అనడని, త్వరలోనే ఈ విషయం గురించి మాట్లాడనున్నట్లు కొన్ని వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి. ఇక ఈ వార్తలపై సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ రియాక్ట్ అయ్యాడు. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలిపాడు.

ఎన్నికల ఫలితాల కారణంగా త్రివిక్రమ్ సినిమాలకు గుడ్ బై చెప్తున్నాడు అన్న రూమర్ కు కౌంటర్ గా.. “మీరు ఎన్నికల ఫలితాల తర్వాత జర్నలిజం నుంచి తప్పుకుంటున్నారా.. ? అంటూ ప్రశ్నించాడు. దీంతో ఈ వార్త ఫేక్ అని తెలుస్తోంది. త్రివిక్రమ్ కచ్చితంగా సినిమాలు చేస్తాడని అర్దమయ్యింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×