E-Paper
Advertisement

Trivikram Thaman: తమన్‌కి త్రివిక్ర‌మ్ షాక్‌!.. మ‌హేష్ సినిమాలో భారీ మార్పు

Trivikram Thaman: తమన్‌కి త్రివిక్ర‌మ్ షాక్‌!.. మ‌హేష్ సినిమాలో భారీ మార్పు
Advertisement

Trivikram Thaman : టాలీవుడ్ నుంచి రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ఒక‌టి. SSMB 28గా సెట్స్‌పై ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు త‌మ‌న్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ముందు అనుకున్నారు. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు త‌మ‌న్ కాకుండా మ‌రో సంగీత ద‌ర్శ‌కుడిని తీసుకోవాల‌ని త్రివిక్ర‌మ్ ఆలోచిస్తున్నారు. ఇంత‌కీ త‌మ‌న్‌ని ఎవ‌రితో గురూజీ రీ ప్లేస్ చేయాల‌నుకుంట‌న్నారో తెలుసా!.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ర‌విచంద్ర‌న్‌.

నిజానికి త్రివిక్ర‌మ్‌, త‌మ‌న్ కాంబినేష‌న్‌లో ఇంత‌కు ముందు వ‌చ్చిన అర‌వింద స‌మేత‌, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాలు సంగీతం ప‌రంగా మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి. అలాంటి త‌మ‌న్‌ను ప‌క్క‌న పెట్టి త్రివిక్ర‌మ్ ఎందుకు మ‌రో సంగీత ద‌ర్శ‌కుడు వైపు చూడాల‌నుకుంటున్నారనేది ఎవ‌రికీ అర్థం కాలేదు. అయితే ఈ వార్త‌లో నిజానిజాలేంట‌నేది త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. అత‌డు, ఖ‌లేజా చిత్రాలు త‌ర్వాత మ‌హేష్, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రాబోతున్న సినిమా ఇది. పూజా హెగ్డే హీరోయిన్‌. రాధా కృష్ణ (చిన‌బాబు) ఈ చిత్రానికి నిర్మాత‌.

Advertisement

SSMB 28 కోసం మహేష్ తన లుక్‌ని పూర్తిగా మార్చుకున్నారు. సిక్స్ ప్యాక్ మేకోవర్‌తో మహేష్ కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ మూవీని రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటిచారు. కానీ రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్.

    Related News

    Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

    Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

    పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

    యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

    Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

    Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

    Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

    Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

    Big Stories

    Advertisement
    ×