Udaya Bhanu : రీసెంట్ టైమ్స్ లో ఒక మాట మాట్లాడాలంటే చాలా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ మాటను వెనక్కి తీసుకోలేము. ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీస్ ని ఇబ్బందికి గురి అవుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ గా మారాయి. చాలామంది రాజేంద్రప్రసాద్ ను విమర్శించారు కూడా, అలానే ఇళయరాజా మాట్లాడిన మాటలు, మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా బాగా ట్రోల్ కి గురి అయ్యాయి. అయితే ఈ తరుణంలో ప్రస్తుతం హరిహర వీరమల్లు ఈవెంట్ లోని ఉదయభాను కామెంట్స్ ఇప్పుడు వరల్డ్ గా మారాయి దీనికి కారణం ఉదయభాను కి కనీస అవగాహన సినిమా గురించి లేకుండా ఆ ఈవెంట్ ను హోస్ట్ చేయడం. ముఖ్యంగా ఒక సినిమా ఈవెంట్ మనం చేస్తున్నామంటే చాలా ప్రిపరేషన్ తో ఉంటుంటారు యాంకర్స్. అది చాలా అవసరం కూడా.
క్లారిటీ లేకుండా ఈవెంట్ కి వచ్చారా.?
పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాకి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ డిలే అవడంతో ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ టేకప్ చేశారు. ఈ సినిమా మీద రోజు రోజుకి అంచనాలు పెంచుతున్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్ను మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈవెంట్లో ఉదయభాను దర్శకుడిని క్వశ్చన్ చేస్తూ… ” మాకెందుకు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పాట పాడారు” అని అనిపిస్తుంది అని మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ పాట పాడిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పాట రిలీజ్ కూడా చేశారు. మాట వినాలి అనే ఆ పాటకు దాదాపు 3 కోట్లకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. ఇక్కడితో ఉదయభానుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
సినిమా పబ్లిసిటీ బాగా చేయలేదా.?
అయితే ఈ హోల్ సిచువేషన్ లో కేవలం ఉదయభాను మాత్రం బ్లైమ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సినిమా పబ్లిసిటీ మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే బజ్ ఈ సినిమాకు లేదు. ఉన్న కూడా అది చాలా తక్కువగా ఉంది అని చెప్పాలి. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు పాటను పాడినప్పుడు అది నెక్స్ట్ లెవెల్ లో వైరల్ అయింది. ఆ రేంజ్ లో ఇది వైరల్ కాలేదు. ముఖ్యంగా ఈ సినిమా ఆల్బమ్ ఏ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫెయిల్ అయినా కూడా ఆల్బమ్ ఎప్పుడు ఫెయిల్ కాదు. అయితే కొన్ని కథల మీద కూడా ఆల్బమ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా కీరవాణి టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నారు అంటే అది మామూలు విషయం కూడా కాదు కదా.
Also Read: Amazon Prime Video : తెలుగు ఇండస్ట్రీపై మీ పెత్తనం ఏంటి అమెజాన్… ఎన్ని సినిమాలకు నష్టం తెస్తారు?