Akhanda 2 Teaser : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నా కూడా బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఉంటాయి. సింహ సినిమాతో మొదలైన ఈ కాంబినేషన్ ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్స్ తో షేక్ చేస్తూనే ఉంటుంది. దాదాపు బాలకృష్ణ పని అయిపోయింది అనుకున్న తరుణంలో బోయపాటి శ్రీను రంగంలోకి దిగి బాక్సాఫీస్ షేక్ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు హ్యాట్రిక్ హిట్స్ సినిమాలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
బోయపాటి శ్రీను విధ్వంసం
ఈ సినిమా టీజర్ పై అంచనాలు ఉండటం అనేది సహజంగా జరుగుతూనే ఉంది. అయితే వీటన్నిటిని మించి ఈ టీజర్ అందించాడు బోయపాటి శ్రీను. ముఖ్యంగా బాలకృష్ణని చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్. ” నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా” అనే డైలాగ్ తో మొదలైన తాండవం చివరి వరకు కొనసాగుతూనే ఉంది. త్రిశూలం తో మొదలైన విధ్వంసం రోమాలు నిక్క పొడుచుకునేలా అనిపిస్తుంది. ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్లో మరో హిట్ సినిమా ఖాయం అని బల్ల గుద్ది చెప్పొచ్చు. బాలకృష్ణ అభిమానులు కాలర్ ఎగరేసుకొని ఈ సినిమాను ప్రమోట్ చేయొచ్చు. అంత అద్భుతంగా డిజైన్ చేశాడు బోయపాటి శ్రీను అని టీజర్ చూస్తే అనిపిస్తుంది.