Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి దెబ్బలు ఎదురవుతున్నాయి. ఎప్పుడూ క్లోజ్‌గా ఉండే.. ఎలాన మస్క్ సైతం దూరమయ్యాడు. ప్రతి విషయంలో ట్రంప్‌ను విమర్శిస్తున్నాడు. ట్రంప్‌ను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్రంప్ కొంత మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఎలాన్ మస్క్ తలపోట్లు, మరోవైపు టెన్షన్‌కు లోనవుతున్న ట్రంప్ ఇవాళ కొంచెమైతే.. విమానం మెట్ల నుంచి కిందపడిపోయేవారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here's a better angle of Trump's tumble, and it's yummy!! 😂pic.twitter.com/O50aKOI1vU
— Sterling (@GreenShades9) June 8, 2025
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విమానం స్టెప్స్ ను ఎక్కుతున్న క్రమంలో కాస్త తడబడ్డాడు. నిన్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో న్యూజెర్సీ లోని బెడ్ మిన్‌స్టర్ నుంచి క్యాంప్ డేవిడ్‌కు వెళ్లే క్రమంలో.. ఈ సంఘటన జరిగింది. ట్రంప్ విమానం స్టెప్స్ ఎక్కుతుండగా ఆయన ఒక మెట్టు తప్పి కాస్త తూలుతూ.. కనిపించారు. అయితే, వెంటనే కవర్ చేసుకుని.. తనంతట తానుగా బ్యాలెన్స్ చేసుకున్నారు ట్రంప్. అనంతరం ఎటుచూడకుండా నేరుగా విమానంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
ALSO READ: Watch Video: డైలీ గంగా నదికి వెళ్తాడు.. కాసులతో తిరిగొస్తాడు, ఏం బుర్ర బ్రో నీది!
అయితే, గతంలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ ఇలాగే విమానం ఎక్కుతుండుగా.. తడబడ్డాడు. అప్పుడు ట్రంప్ ఆయనను ఎగతాళి చేస్తూ కామెంట్ చేశారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే రీతిలో తడబడటంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తెగ కామెంట్లు చేస్తున్నారు. ఆ రోజు నవ్వాడు.. ఈ రోజు ఆయన పడ్డాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కర్మ ఫలితం అంటూ.. మరి కొంత మంది నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. క్యాంప్ డేవిడ్ పర్యటనకు ముందు.. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల వలస దాడుల నేపథ్యంలో లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న నిరసనలను అదుపు చేయడానికి ఇన్సరెక్షన్ యాక్ట్‌ను ప్రయోగించే ఆలోచన ఉందా అని అక్కడి రిపోర్టర్ లు ప్రశ్నించారు. అయితే, దీనిపై ఆయన రియాక్ట్ అవ్వలేదు.
ALSO READ: Viral Video : చెట్టు నుంచి నీళ్లు.. దేవుడి మహిమేనా? వీడియో వైరల్
విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి ట్రంప్ రిపోర్టర్లతో మాట్లాడారు. క్యాంప్ డేవిడ్ పర్యటన గురించి రిపోర్టర్లు ప్రశ్నించారు. తాము క్యాంప్ డేవిడ్‌కు వెళ్తున్నామని డొనాల్డ్ ట్రంప్ సమాధానం ఇచ్చారు. చాలా ముఖ్యమైన విషయాలపై వివిధ వ్యక్తులతో సమావేశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. మరిన్ని వివరాలు చెప్పాలని అడగగా.. ఇవన్నీ చాలా ముఖ్యమైనవని.. కానీ తాను ఇప్పుడు వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదని వివరించారు. క్యాంప్ డేవిడ్‌లో జరిగే సమావేశాలకు ఎవరైనా ఇతర దేశాల నుంచి గెస్ట్ లు హాజరవుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బదులిచ్చారు.