Amazon Prime Video : ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు మాత్రం ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం సినిమా మాత్రమే. ఒకప్పుడు సినిమా కోసం థియేటర్ కు ప్రేక్షకులు విపరీతంగా వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు థియేటర్ కు వచ్చే ప్రేక్షకులు కంప్లీట్ గా తగ్గిపోయారు. దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా పైరసీ ఇండస్ట్రీని కొంతవరకు నాశనం చేసింది అని కొంతమంది అభిప్రాయం పడ్డారు. ఆ తర్వాత కాలంలో ఓటీటీ వచ్చిన తర్వాత పరిస్థితులు మరి దారుణంగా తయారయ్యాయి. సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీ లో ప్రత్యక్షం అవడం అనేది థియేటర్ బిజినెస్ కు తీవ్రమైన దెబ్బను కొట్టింది. ఒక సూపర్ హిట్ సినిమా 100 రోజులు 50 రోజులు ఆడిన తర్వాత టీవీలో వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు ఆ సినిమా వారం రోజుల్లోనే మంచి కలెక్షన్స్ వసూలు చేసి నెలరోజుల్లో ఓటిటి వచ్చేస్తుంది.
ఓటిటి వలన ఇబ్బందులు
ఓటిటి వచ్చిన తర్వాత చాలామంది ప్రేక్షకులు థియేటర్ కు రావడం మానేశారు అనేది వాస్తవం. కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ఎంకరేజ్ చేస్తారు అనేది కూడా వాస్తవమే. కానీ థియేటర్ కు వెళ్లి ఏం చూస్తాంలే అని ఒక ఒపీనియన్ చాలామంది ప్రేక్షకులకు వచ్చేసింది. కేవలం ఒక స్టార్ హీరో సినిమా విడుదలయితే మాత్రమే ప్రేక్షకులు థియేటర్ వరకు వస్తున్నాడు. ఇక స్టార్ హీరోలు సినిమాలు కూడా రెండేళ్లకు ఒక సినిమా మూడేళ్లకు ఒక సినిమా వస్తున్నాయి. ఈ తరుణంలో ఓటీటీ వలన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా ఇబ్బందులకు గురి అవుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఓటిటి బాగా శాసిస్తుంది. వాళ్లు చెప్పిన విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నడుచుకోవాల్సి వస్తుంది. వాళ్లకు ఇచ్చిన కమిట్మెంట్స్ కారణంగా ఓ క్వాలిటీ లేని సినిమాను ప్రేక్షకుల మీదకు వదలాల్సి వస్తుంది. ఇలాంటివి బోలెడు పరిణామాలు జరుగుతున్నాయి.
సినిమాలను ఇబ్బంది పెడుతున్న అమెజాన్
ప్రముఖ ఓటిటి సంస్థల్లో అమెజాన్ ప్రైమ్ ఒకటి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎన్నో క్వాలిటీ సినిమాలు ఉన్నాయి. అలానే మంచి సినిమాలు కూడా ఉన్నాయి. దీన్ని ఎవరు కాదని చెప్పలేరు. కానీ ఇప్పుడు సినిమా మొదలుపెట్టిన తరుణంలోని ఓటిటి రైట్స్ అనుకుంటున్నారు కొంతమంది నిర్మాతలు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఓటిటి వాళ్లు డిసైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డీల్ వలన హరిహర వీరమల్లు సినిమా ఇబ్బందిపడుతుంది. సినిమా రిలీజ్ లేట్ కావడంతో దాదాపు 20 కోట్ల వరకు అనుకున్న రేట్లు కట్ చేసింది అమెజాన్ ప్రైమ్, అలానే కుబేర రిలీజ్ డేట్ వాయిదా వేస్తామంటే 10 కోట్లు కట్ చేస్తాం అని అమెజాన్ ప్రైమ్ చెప్పింది. మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాకి చాలా తక్కువ రేటును కోట్ చేశారు. సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడదాం అని విష్ణు వాళ్లకు చెప్పే. ఇక దీనిపై ఇండస్ట్రీలోని పెద్దలంతా కలిసి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే ఇండస్ట్రీకి నష్టం జరగడం ఖాయం.
Also Read : Kuberaa: 10 రోజుల్లో రిలీజ్, ఇంకా రెండు పాటలు పెండింగ్