BigTV English

Sukumar About Game Changer : లెక్కల మాస్టారు లెక్క తప్పింది… అంత పెద్ద స్టేట్మెంట్లు ఎందుకు ?

Sukumar About Game Changer : లెక్కల మాస్టారు లెక్క తప్పింది… అంత పెద్ద స్టేట్మెంట్లు ఎందుకు ?

Sukumar About Game Changer : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ పాన్ డైరెక్టర్స్ లో ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్ ఒకరు. ఇద్దరు దర్శకులు ఎవరికి వారే ప్రత్యేకమని చెప్పాలి. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. అయితే సుకుమార్ వర్క్ కి ఎస్ఎస్ రాజమౌళి ఎంత పెద్ద అభిమానో చాలా మందికి తెలియదు. ఆర్య సినిమా విడుదలైనప్పుడు రాజమౌళి ఆ సినిమా చూసి నాకు ఎవడో గట్టి పోటీ వచ్చేలా ఉన్నాడు అని ఫీల్ అయ్యారట. వాస్తవానికి ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి ఎవరు అందుకోలేని స్థాయిలో ఉన్నాడు. తెలుగు సినిమాని శిఖరం మీద కూర్చోబెట్టిన ఘనత ఎస్.ఎస్ రాజమౌళికి దక్కింది. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో ఉన్న దర్శకుడు అంటే సుకుమార్.


ఆర్య సినిమాతో ప్రయాణాన్ని మొదలుపెట్టిన సుకుమార్ అతికొద్ది కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఒక సుకుమార్ దగ్గర పని చేసిన చాలా మంది సహాయ దర్శకులు… దర్శకులుగా మారారు. ఈ జనరేషన్ లో అంత మంది దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత సుకుమార్ కు మాత్రమే దక్కుతుంది అని చెప్పాలి. సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన చాలామంది దర్శకులై ప్రూవ్ చేసుకున్నారు. సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన శ్రీకాంత్ ఓదెల నేడు మెగాస్టార్ తో సినిమా చేసే రేంజ్ కి ఎదిగాడు. బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమా చేసే రేంజ్ కి ఎదిగాడు.

అయితే కొన్నిసార్లు సుకుమార్ సినిమాలు ఫెయిల్ అయినా కూడా ఆ సినిమాకు ఒక డిగ్నిటీ ఉంటుంది. వన్ నేనొక్కడినే సినిమా ఫెయిల్ అయిన కూడా సుకుమార్ రెస్పెక్ట్ పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు. ఇక సుకుమార్ ఇచ్చే కొన్ని స్టేట్మెంట్లు వలన సుకుమార్ పై రెస్పెక్ట్ కొన్నిసార్లు తగ్గుతుంది అని చెప్పాలి.


దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సందర్భంలో పూరి జగన్నాథ్ దగ్గర పని చేయాలి అనే ఆలోచన కూడా సుకుమార్ కు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా పూరి జగన్నాథ్ తో సుకుమార్ చెప్పారు. అయితే లైగర్ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యులో సుకుమార్ మాట్లాడుతూ ఈ సినిమాకి 1000 కోట్లు వస్తుంది అంటూ పూరి జగన్నాథ్ ముందే చెప్పారు. ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పూరి కెరీర్ ని పాతాళానికి తొక్కేసిన సినిమా అది. ఆ తర్వాత చాలా కష్టపడి డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసిన కూడా ఆ సినిమా ఫలితం అందరికీ తెలిసిన విషయమే. అయితే సుకుమార్ కాన్ఫిడెన్స్ అప్పుడు చాలామందిని నిరుత్సాహపరిచింది.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంటుంది. కొంతమంది దీనిని డిజాస్టర్ అని కూడా డిసైడ్ చేసేసారు. ఈ సినిమాకి ఒక భారీ హైప్ క్రియేట్ చేశాడు సుకుమార్. “సినిమాను నేను చిరంజీవి గారితో పాటు చూసానని, రంగస్థలం సినిమా చేసేటప్పుడు రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాను రాలేదు. ఈ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ చూసి ఖచ్చితంగా ఈ సినిమాకి రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు వస్తుంది” అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఆల్రెడీ ఒక నటుడికి నేషనల్ అవార్డు తన సినిమా ద్వారా ఇప్పించిన సుకుమార్ ఆ మాట చెప్పేసరికి సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. తీరా సినిమాలో క్లైమాక్స్ చూస్తే చాలామంది నిరాశ పడ్డారు. అసలు సుకుమార్ ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. లెక్కలు మాస్టర్ లెక్క తప్పుతున్నాడు అంటూ కామెంట్స్ కూడా మొదలయ్యాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×