Vishwak Sen : విశ్వక్ సేన్… ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది మల్టీ టాలెంటెడ్ హీరోల్లో ఈయన ఒక్కడు. ఆయనే హీరో, ఆయనే డైరెక్టర్, ఆయనే రైటర్. ఇంకా చెప్పాలంటే… ఆయనే నిర్మాత కూడా.
ఈ మల్టీ టాలెంట్ వల్లే విశ్వక్ అతి తక్కువ రోజుల్లో ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదిగాడు. ఈ టాలెంట్‌ను చూసే నందమూరి హీరోలు తారక్, బాలయ్య కూడా విశ్వక్‌ను సపొర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఈ యంగ్ హీరోకు ఉన్న నోటి దూలనే కొంత మైనస్‌లా కనిపిస్తుంది.
నార్మల్‌గా విశ్వక్ సైలెంట్‌గా, గుడ్ బాయ్ లానే ఉంటాడు. కానీ, ఎప్పుడైతే ఆయన సినిమా రిలీజ్‌కు వస్తుందో… అప్పుడు తన నోటి నుంచి కొన్ని ఆణిముత్యాలు రావడం, వాటిపై పెద్దగా చర్చ జరగడం, ట్రోల్స్ రావడం జరుగుతూ ఉంటుంది.
ప్రస్తుతం ఈ యంగ్ హీరో మెకానిక్ రాకీ అనే మూవీతో ఈ నెల 22న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఆదివారం ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ 2.0 లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో విశ్వక్ ఎప్పటిలానే రెచ్చిపోయి మాట్లాడాడు. జాంట్, పీకలేరు. అంటూ చాలా పదాలు వాడాడు.
ఓ వ్యక్తి గురించి మాట్లాడుతూ స్టేజ్‌పై విశ్వక్ నుంచి వచ్చిన ఈ మాటలు ప్రస్తుతం చర్చకు దారి తీస్తున్నాయి. విశ్వక్ అన్నది ఎవరిని అని ఒకటి అయితే… ఒక హీరో స్టేజ్‌పైన ఇలాంటి మాటలు మాట్లడటం ఏంటి అనేది మరొకటి.
సరే… ఇన్ని మాట్లాడాడు.. మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మరొక రకమైన చర్చ. విశ్వక్ నుంచి వచ్చిన మాటలకు కారణం కాన్ఫిడెంటా..? లేదా ఎప్పటిలానే ప్రతి సినిమా ముందు చేసే పబ్లిసిటీ స్టంటా..? ఇలా చర్చ జరుగుతుంది.
అలాగే, “సినిమా బాలేకపోతే, చూడకండి, మరోసారి రివ్యూ రైటర్స్ గురించి మాట్లాడను” లాంటి డైలాగ్స్ వల్ల కూడా మెకానిక్ రాకీ సినిమా హిట్ అవుతుందా…? ఫట్ అవుతుందా..? అనే టాక్ నడుస్తుంది.
మూవీ హిట్ అయితే, విశ్వక్ మాటలను అందరూ మర్చిపోతారు. విశ్వక్‌కు మరో హిట్ పడింది అంటూ పొగడ్తలు వస్తాయి. కానీ, ఒక వేళ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే మాత్రం… విశ్వక్ చేసింది మొత్తం పబ్లిసిటీ స్టంట్ అని… సినిమాలో మ్యాటర్ లేదు కాబట్టే, ఇలాంటి డైలాగ్స్ వల్ల ఆడియన్స్ ను తన వైపు, సినిమా వైపు తిరిగేలా చేశాడు అనే ట్రోల్స్ భారీగా వస్తాయి.
ఇప్పటి వరకు అయితే ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. సినిమా చూడాలి అనే పాయింట్ ఎక్కడా పెద్దగా క నిపించలేదు. ట్రైలర్ 1.0 చూసిన తర్వాత రోటీన్ స్టోరీ అనే అర్థమైంది. ఎలాంటి కొత్తదనం లేని కథను ఈ మల్టీ టాలెంటెడ్ హీరో ఎలా ఒప్పుకున్నాడు అనే మాటలు ట్రైలర్ 1.0 రిలీజ్ అయ్యాక వినిపించాయి.
ఇప్పుడు ట్రైలర్ 2.0 రాబోతుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సింది. కానీ, ఇప్పవరకు రిలీజ్ అవ్వలేదు. ఈ రాబోయే ట్రైలర్ ఇప్రెసివ్ గా ఉంటే, విశ్వక్ సేన్ సినిమాను చూడటానికి ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక వేళ ట్రైలర్ 1.0 లానే ఈ ట్రైలర్ 2.0 కూడా ఉంటే… విశ్వక్ తన మాటలపై ట్రోల్స్ చూడటానికి రెడీ అయిపోవాల్సిందే.
ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి… ఈ మెకానిక్ రాకీ సినిమాను విశ్వక్ సేన్ ఎలాగైనా హిట్ చేసుకోవాల్సిందే. అందుకోసం ఎలాంటి ప్రమోషన్స్ అయినా.. చేయాలి. లేకపోతే ఆదివారం జరిగిన ట్రైలర్ 2.0 లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ వాడిన జాంట్, పీకలేరు అనే వర్డ్స్‌తో ఆయననే ట్రోల్స్ చేసే అవకాశం చాలా ఎక్కువే ఉంది.