E-Paper
Advertisement

Tumbbad Re Release: టెర్రిఫిక్ హర్రర్ మూవీ ‘తుంబాడ్’ రీరిలీజ్.. 24 గంటల్లోనే ఊహించని రికార్డ్, స్టార్ హీరోస్‌కు కూడా ఈ క్రేజ్ ఉండదేమో!

Tumbbad Re Release: టెర్రిఫిక్ హర్రర్ మూవీ ‘తుంబాడ్’ రీరిలీజ్.. 24 గంటల్లోనే ఊహించని రికార్డ్, స్టార్ హీరోస్‌కు కూడా ఈ క్రేజ్ ఉండదేమో!
Advertisement

Tumbbad Re Release Bookings: ప్రస్తుతం ఇండియన్ సినిమాలో రీ రిలీజ్ అనేది కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. రీ రిలీజ్ సినిమాలకు వెళ్లడం, అందులోని సీన్స్‌ను థియేటర్లలో రీ క్రియేట్ చేయడం.. ఇది ప్రేక్షకులకు ఫేవరెట్ హాబీలాగా మారిపోయింది. ఈ రీ రిలీజ్ సినిమాలకు సోషల్ మీడియాలో చాలా క్రేజ్ లభిస్తోంది. దాంతో పాటు దీని వల్ల మరొక లాభం కూడా జరుగుతోంది. కొన్ని సినిమాలు బాగున్నా కూడా అందులోని సారాంశాన్ని సరిగా గుర్తించలేక, అర్థం చేసుకోలేక.. వాటిని ఫెయిల్ చేస్తుంటారు. అలాంటి సినిమాలు మళ్లీ రీ రిలీజ్ అయ్యి పలు రికార్డులను తిరగరాస్తున్నాయి. తాజాగా ఒక బాలీవుడ్ చిత్రం కూడా అదే కేటగిరిలో చేరింది.

విపరీతమైన రెస్పాన్స్

Advertisement

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకులంతా తిరిగిచూసేవారు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి చాలా మారిపోయింది. స్టార్ హీరోలు సైతం ఒక్క హిట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే సౌత్‌లో మేకర్స్ ప్రారంభించిన రీ రిలీజ్ ట్రెండ్‌ను బాలీవుడ్ కూడా ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. కొన్ని క్లాసిక్ చిత్రాలను బయటికి తీసి థియేటర్లలో విడుదల చేయడం మొదలుపెట్టింది. దానికి బాలీవుడ్ ఆడియన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ లభించింది. ఒకప్పుడు థియేటర్లలో ఫ్లాప్‌గా నిలిచిన ‘లైలా మజ్ను’, ‘రాక్‌స్టార్’ లాంటి సినిమాలు రీ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ విషయంలో రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు మరో చిత్రం కూడా ఈ లిస్ట్‌లో యాడ్ అవ్వనుంది.

Also Read: తమన్నా.. చూశావా నీవల్ల పిల్లలు ఎలా చెడిపోతున్నారో!

Advertisement

థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలి

బాలీవుడ్ తెరకెక్కించిన హారర్ సినిమాల్లో బెస్ట్‌గా చెప్పుకోదగినది ‘తుంబాడ్’. 2018లో విడుదలయిన ఈ సినిమా.. సరిగా ప్రమోషన్స్ లేక ఎక్కువమందిని రీచ్ అవ్వలేకపోయింది. కానీ ఓటీటీలో విడుదలయిన తర్వాత ఈ మూవీని చూసిన ప్రేక్షకులంతా పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలాంటి హారర్ మూవీని థియేటర్లలో చూస్తే బాగుంటుందని ఫీల్ అయ్యారు. ప్రేక్షకుల అభిప్రాయం మేకర్స్ వరకు వెళ్లడంతో ‘తుంబాడ్’ను రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 13న రీ రిలీజ్ తేదీకి ముహూర్తం ఫిక్స్ చేశారు. రెండు రోజుల ముందే ‘తుంబాడ్’కు బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇక ఇప్పుడు బుక్ మై షోలో ఈ సినిమా బుకింగ్స్ ఒక రేంజ్‌లో దూసుకుపోతున్నాయి.

లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను మించి

‘తుంబాడ్’లో సోహుమ్ షా హీరోగా నటించారు. 2018లో ఈ మూవీ విడుదల అయినప్పుడు దీనికి కేవలం రూ.0.65 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్న టికెట్ బుకింగ్స్ చూస్తుంటే రీ రిలీజ్ అయిన మొదటిరోజే ఈ మూవీ లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను దాటేస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో బుక్ మై షోలో ‘తుంబాడ్’ రీ రిలీజ్ కోసం 6.45K టికెట్లు బుక్ అయ్యాయి. ఎంతో హైప్, ఎన్నో అంచనాల మధ్య ‘తుంబాడ్’ రీ రిలీజ్ ప్రేక్షకులను చాలా ఎగ్జైట్ చేస్తోంది. దర్శకుడిగా రాహి అనిల్ బార్వే కూడా ఈ రీ రిలీజ్‌తో మరోసారి బాలీవుడ్ బడా మేకర్స్ దృష్టిలో పడే అవకాశాలు ఉన్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×