EPAPER

Samsung Galaxy S25 Ultra: లీకైన గెలాక్సీ ఎస్25 అల్ట్రా రెండర్స్.. భయ్యా ఫీచర్స్ మామూలుగా లేవుగా!

Samsung Galaxy S25 Ultra: లీకైన గెలాక్సీ ఎస్25 అల్ట్రా రెండర్స్.. భయ్యా ఫీచర్స్ మామూలుగా లేవుగా!

Samsung Galaxy S25 Ultra’s Leaked CAD Renders: ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ కంపెనీ సామ్‌సంగ్ అదిరిపోయే ఫీచర్స్‌తో మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఇటీవల సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ విజయం సాధించడంతో మరో కొత్త సిరీస్ తీసుకొస్తుంది.


అయితే గెలాక్సీ ఏఐ పరిచయం తర్వాత వచ్చే ఏడాది లాంచ్ కానున్న గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌పై సామ్‌సంగ్ కంపెనీ ఫోకస్ పెట్టింది. త్వరలోనే తన ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్25ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లాంచ్ కోసం సామ్‌సంగ్ మొబైల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా రెండర్స్ లీక్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్స్ రిలీల్ అవుతున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా ఫోన్ ఫీచర్స్‌పై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాకపోయిన్పటికీ ఆన్‌లైన్‌లో ఈ ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. లీక్ అయినా ఫీచర్స్ ప్రకారం.. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 కంటే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఫోన్‌లో ఫీచర్లు ఫ్లాట్‌గా ఉన్నాయని తెలుస్తోంది. డిజైన్ పరంగా మరింత అట్రాక్ట్ గా సూచిస్తున్నారు.


సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా డిజైన్ రెండర్లను లీక్ చేసింది. క్యాడ్ రెండర్లు కొత్త పిక్సెల్ 9, ఐఫోన్ మోడల్ మాదిరిగా డిజైన్ లుక్ వచ్చేలా ఫ్లాట్ సైడ్‌లతో భిన్నంగా వచ్చేలా డిజైన్ సూచిస్తుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌ 219 గ్రాములతో తేలికగా ఉంటుంది. అంతకుముందు గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా 232 గ్రాములతో పోల్చితే 13 గ్రాములు తక్కువ అని చెప్పాలి.  అలాగే 8.2ఎంఎం మందం తోపాటు 162.8ఎంఎం పొడవు, 77.6ఎంఎం వెడల్పు ఉన్నట్లు సూచించింది.

ఈ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా వచ్చే ఏడాది జనవరిలో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇక, కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో ప్రధాన కెమెరా 200 మెగాపిక్సెల్, 50 మెగా పిక్సెల్‌తో కూడిన రెయిర్ కెమెరా, సెల్పీలకోసం 13 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇకపోతే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా స్మార్ట్ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 8 జెన్4ఎస్ఓసీ ప్రాసెసర్ ను అందించనున్నారు. అలాగే ఏఐ ఆధారిత ఫీచర్ తీసుకొచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. అలాగే హ్యాండ్ సెట్ 45wఫాస్ట్ ఛార్జింగ్‌ ఉండనుంది. చివరగా, ఈ ఫోన్ స్టోరేజ్ విషయానికొస్తే.. 16జీబీ ర్యామ్ నుంచి 1టీబీ వరకు కలిగి ఉందని తెలుస్తుంది.

Also Read: ఆనర్ 200 సిరీస్ లో కొత్త ఎఐ ఫీచర్స్.. మ్యాజిక్ ఎరేజర్, ఫేస్ టు ఫేస్ ట్రాన్లేషన్.. మరెన్నో!

ప్రధానంగా గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా ఎస్ పెన్, అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్ తో వస్తుంది. అలాగే డస్ట్, వాటర్ ఫ్రూప్, శాటిలైట్ కనెక్టివిటీకి ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Related News

Android : ఆండ్రాయిడ్ వాడుతున్నారా.. ఆ ట్రిక్స్ తెలుసుకోకపోతే హ్యాక్ అవుతుంది మరి!

iPad mini: ఆపిల్ కొత్త ఐప్యాడ్ చూశారా…? ఫీచర్స్ చూస్తే దిమ్మ తిరిగిపోద్దీ

Redmi : రూ. 8,999కే Redmi 5G స్మార్ట్ ఫోన్ – స్పెసిఫికేషన్స్ అదుర్స్ గురూ!

Realme : ఆఫర్ అదుర్స్.. స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపుతో పాటు రూ.2,499 ఇయర్ బర్డ్స్ ఫ్రీ

Whatsapp : వాట్సాప్ షాకింగ్ డెషిషన్.. లక్షల్లో అకౌంట్స్ బ్యాన్

Jio Bharat V3 And V4 : అతి తక్కువ ధరకే జియో భారత్ మొబైల్స్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Android Tips : ఆండ్రాయిడ్‌లో చాలా మందికి తెలియని ఫీచర్స్.. మీరు ట్రై చేశారా?

Big Stories

×