BigTV English

Tamannaah Aaj Ki Raat: తమన్నా.. చూశావా నీవల్ల పిల్లలు ఎలా చెడిపోతున్నారో!

Tamannaah Aaj Ki Raat: తమన్నా.. చూశావా నీవల్ల పిల్లలు ఎలా చెడిపోతున్నారో!

Tamannaah Aaj Ki Raat: ఈరోజుల్లో పిల్లలకు స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ వల్ల చాలా విషయాలు అతి చిన్న వయసులో తెలిసిపోతున్నాయి. దీనివల్ల వారిపై తీవ్రమైన ప్రభావం కూడా పడుతుంది. ముఖ్యంగా సినిమాల్లో ఏది మంచి, ఏది చెడు అని గుర్తించలేని వయసులోని వారిపై సినిమాల ప్రభావం పడుతుంది. తాజాగా స్కూల్ పిల్లలు ఒక ఐటెమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అస్సోంలోని స్కూల్ పిల్లలు ‘స్త్రీ 2’ సినిమాలో తమన్నా చేసిన ‘ఆజ్ కీ రాత్’ ఐటెమ్ సాంగ్ స్టెప్పులేయడం వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లంతా దీనిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


అవే కాస్ట్యూమ్స్

ఈరోజుల్లో స్కూల్స్‌, కాలేజ్‌ల్లో జరిగే ఈవెంట్స్‌లో ఐటెమ్ పాటలకు స్టెప్పులేయడం చాలా కామన్‌గా మారిపోయింది. సినిమాలో హీరోయిన్ ఎలా డ్యాన్స్ చేసిందో అలాగే చేసి చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. కానీ అది ఇతర పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని తల్లిదండ్రులతో పాటు స్కూల్స్ యాజమాన్యం కూడా మర్చిపోతోంది. అందుకే టీచర్స్ డే సందర్భంగా ‘ఆజ్ కీ రాత్’ పాటకు స్కూల్ పిల్లలు డ్యాన్స్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆ పాటకు డ్యాన్స్ చేయడం మాత్రమే కాకుండా పిల్లలంతా తమన్నాలాగానే బట్టలు వేసుకోవడం.. ఆ వీడియో చూసిన నెటిజన్లను మరింత ఇబ్బందికి గురిచేస్తోంది.


Also Read: హోటల్ గదిలో వేణు మాధవ్, నేను ఒకే బెడ్ మీద పడుకున్నాం- హస్కీ వాయిస్‌తో ఆయన అలా అడిగే సరికి షాకయ్యా: షకీలా

ఆయనను అవమానించారు

ఇండియాకు రెండో ప్రెసిడెంట్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డేను జరుపుకుంటాం. అలాగే అస్సోంలోని ఒక స్కూల్‌లో వెనుక బ్యానర్‌పై సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటో పెట్టుకొని దాని ముందే ‘ఆజ్ కీ రాత్’ అనే ఐటెమ్ పాటకు తమన్నాలాగా రెడీ అయ్యి పిల్లలు డ్యాన్స్ చేయడం అవమానకరం అని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ వీడియో బయటికి రాగానే అసలు స్కూల్ యాజమాన్యం ఇలాంటి పాటకు డ్యాన్స్ చేయడానికి పిల్లల్ని ఎలా అనుమతించారని విమర్శించడం మొదలుపెట్టారు. మరికొందరు అయితే తప్పు స్కూల్ యాజమాన్యం మాత్రమే కాదు.. పేరెంట్స్ కూడా చేశారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫేమస్ అయిపోవాలి

‘ఒక టీచర్ ట్రైనింగ్ ఇవ్వకుండా పిల్లలు ఈ పాటకు డ్యాన్స్ చేసేవారు కాదు. పిల్లలు ఎలాంటి పాటలు పాడాలన్నా, పాటలకు డ్యాన్స్ చేయాలన్నా స్కూల్‌లోని ఒక టీచరే పర్సనల్‌గా ట్రైనింగ్ ఇస్తుంది. ఇక్కడ కూడా ఇలాగే జరిగుంటుంది’ అని ఒక నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు మనం మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం అని మరొక నెటిజన్ మండిపడ్డారు. ‘ఈరోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా అయినా ఫేమస్ అయితే చాలు అనుకుంటున్నారు’ అంటూ ఈరోజుల్లో రియాలిటీ గురించి మరొకరు కామెంట్ చేశారు. అలా ఒక్కసారిగా ఈ పాట గురించి, దీనిపై స్కూల్ పిల్లల డ్యాన్స్ గురించి సోషల్ మీడియాలో దుమారం రేగింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×