BigTV English

Jabardasth Rakesh post: జబర్దస్త్ రాఖేష్ హ్యాపీ మూడ్..కారణం ఏమిటో?

Jabardasth Rakesh post: జబర్దస్త్ రాఖేష్ హ్యాపీ మూడ్..కారణం ఏమిటో?

TV comedy show pair Jabardasth Rakesh and Sujatha post viral Baby bumps:
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటీనటులు చాలా మందే ఉన్నారు. కొందరికి సినిమా ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. సపోర్టింగ్ రూల్స్, టీవీ సీరియల్స్, యాంకరింగ్ ఇలా వివిధ రంగాలలో చొచ్చుకుపోతున్నారు. ఇదంతా ఆ కామెడీ షో మహిమే. అందుకే రెమ్యునరేషన్ పట్టించుకోకుండా జబర్ధస్త్ లో నటించేందుకు ఇష్టపడుతుంటారు.కొన్ని కారణాల వలన ఈ షో నుంచి బయటకు వెళ్లిపోయినా మళ్లీ తిరిగి ఇదే షోకి వస్తుంటారు. ఎందుకంటే ఈ షో ద్వారా వాళ్లకు వచ్చిన పాపులారిటీ మరే ఇతర షోల ద్వారా రాదు. ఇక బుల్లి తెర ద్వారా ఒక్కటైన జంటలు ఉన్నారు. వాళ్లలో రాఖేష్, సుజాత జంట ఒకరు.


జబర్థస్త్ జంట

జబర్థస్త్ షో లో ఇద్దరూ కలిసి నటిస్తున్నప్పుడే వీరిద్దరిలో ప్రేమ చిగురించింది. సుజాత కూడా జోర్ దార్ సుజాత గా ఓ పాపులర్ టీవీలో పాపులారిటీ సాధించుకుంది. జబర్థస్త్ లో నటించాలనే కోరికతో రాఖేష్ టీమ్ లో జాయిన్ అయింది. అనుకోకుండా ఈ జంట ఈ షోలో సక్సెస్ పెయిర్ గా నిలిచారు. దీనితో తమ ప్రేమ వ్యవహారం ఇరువురూ తమ పెద్దలకు చెప్పి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకున్నా కొంత కాలం జబర్థస్త్ లో స్కిట్లు చేస్తునే ఉన్నారు. ఇద్దరికీ సోషల్ మీడియాలో బాగానే ఫాలోవర్స్ ఉన్నారు.


మీడియాకు దూరం అందుకేనా?

ఇటీవల కాలంలో సుజాత మీడియాకు దూరంగా ఉంటోంది. సడన్ గా రాఖేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. తన ఇన్ స్టా గ్రామ్ లో భార్య సుజాత ప్రెగ్నెంట్ గా ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. తన భార్య బేబీ బంప్స్ ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ పోస్ట్ పెట్టాడు. అందరూ గుడ్ న్యూస్ అంటూ రాఖేష్ పెట్టిన పోస్టుకు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో. మీ జంట పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆశీర్వదిస్తూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు అయితే మరో బుల్లి రాఖేష్ రాబోతున్నాడని పోస్ట్ పెడితే కొందరు జూనియర్ జోర్ దార్ సుజాత పుట్టబోతోందంటూ పోస్టులు పెడుతున్నారు. అభిమానుల పోస్టింగులు చూసి రాఖేష్, సుజాత జంట మురిసిపోతున్నారు.

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×