BigTV English

Vijay Deverakonda Lineup Movies: విజయ్ దేవరకొండ లైనప్ ఏంటి బాసూ ఇంత సాలిడ్‌గా ఉంది..!

Vijay Deverakonda Lineup Movies: విజయ్ దేవరకొండ లైనప్ ఏంటి బాసూ ఇంత సాలిడ్‌గా ఉంది..!

Vijay Deverakonda Lineup Movies: సినీ పరిశ్రమకు కొందరు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటారు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుని మంచి పాపులారిటీ తెచ్చుకుంటారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సైడ్ క్యారెక్టర్లు చేసుకునేవాడు. ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి హిట్ అవ్వడమే కాకుండా భారీ కలెక్షన్లు నమోదు చేసింది. దీంతో హీరోగా తొలి మెట్టు ఎక్కాడు.


అక్కడ నుంచి అర్జున్ రెడ్డి, గీతా గోవిందాం వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో రౌడీబాయ్‌ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక అతడి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కింది. కానీ థియేటర్లలో రిలీజ్ అయిన అనంతరం నెగెటివ్ టాక్‌తో ఫ్లాప్‌గా మిగిలింది. ఈ సినిమాను చాలా మంది రిజెక్ట్ చేశారు. అలా మంచి హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా విజయ్ ఆశలను అడియాశలు చేసింది.

ఇక అక్కడ నుంచి విజయ్ నటిస్తున్న ఏ సినిమా కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ సాధించలేకపోయింది. లైగర్ తర్వాత అతడు చేసిన సినిమా ‘ఖుషి’. ఈ సినిమా కూడా ఎన్నో అంచనాలతో తెరకెక్కింది. కానీ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఆ తర్వాత ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో వచ్చాడు. అది మంచి హిట్ అవుతుందని అంతా భావించారు. కానీ ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయినా.. యూత్ మాత్రం ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు.


Also Read: రౌడీబాయ్ విజయ్ డబుల్ డోస్.. పెద్ద ప్లాన్‌తోనే వస్తున్నాడుగా..

అలా విజయ్ నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ టాక్ అందుకుంటూనే ఉంది. ఇలా హిట్ పదానికి దూరమైన విజయ్ ఇప్పుడు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ చాలా జాగ్రత్తలు పడుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం గౌతం తిన్ననూరి దర్శకత్వంలో ‘విడి 12’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి పోలీస్, మరొకటి ఖైదీగా. ఇటీవలే ఒక పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమాతో పాటు విజయ్ తన లైనప్‌లో చాలా సినిమాలే ఉంచాడు. ఇప్పుడు ఆ లైనప్ చూసి సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. విజయ్ లైనప్‌లో ఇప్పుడున్న VD12 తర్వాత దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో VD14 మూవీ చేయబోతున్నాడు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. ఈ మూవీ పీరియాడికల్ జోనర్లో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందబోతుంది. దీని తర్వాత దర్శకుడు రవికిరణ్ కోలా డైరెక్షన్‌లో VD15 చేయబోతున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే ‘వేడివేల్’ మూవీకి సీక్వెల్‌లో నటించబోతున్నాడు. ఇక ఈ చిత్రాలన్నీ పూర్తయ్యాక లెక్కల మాస్టర్ సుకుమార్‌తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇది మాత్రమే కాకుండా సందీప్ రెడ్డి వంగాతో మరోసారి జతకట్టనున్నాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్‌తో మరో ఇంట్రెస్టింగ్ కథతో సినిమాను చేబోతున్నాడు. ఇలా విజయ్ దేవరకొండ చాలా సినిమాలను తన లైనప్‌లో పెట్టుకున్నాడు.

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×