BigTV English

Ugram movie review : అల్లరి నరేష్ యాక్షన్ అదుర్స్ .. ఉగ్రం సినిమా ఎలా ఉందంటే..?

Ugram movie review : అల్లరి నరేష్ యాక్షన్ అదుర్స్ .. ఉగ్రం సినిమా ఎలా ఉందంటే..?


Ugram movie review(Allari Naresh New Film) : కామెడీతో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో అల్లరి నరేష్. ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘మహర్షి’ , నాంది లాంటి సినిమాలతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. తాజాగా మరో వైవిధ్యభరిత చిత్రం ఉగ్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా న‌రేష్ నటించాడు. మ‌రి ఈ సినిమా క‌థ ఏంటి? మూవీ ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌ : హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా నేపథ్యంలో కథ సాగుతుంది. చాలామంది ఆడపిల్లలు, మహిళలు మిస్ అవుతారు. ఈ మాఫియాకు సీఐ శివకుమార్ అంటే అల్లరి నరేష్ ఫ్యామిలీ కూడా బలవుతుంది. శివకుమార్ కు ఓ భయంకరమైన నేపథ్యం ఉంటుంది. అస‌లు ఈ శివ కుమార్ ఎవరు? మహిళల అదృశ్యం వెనుక ఉంది ఎవరు? శివ కుమార్ ఈ మాఫియాకు ఎలా చెక్ పెట్టాడు? అనేది సినిమాలో చూడాల్సిందే.


పోలీస్ అధికారి పాత్రలో అల్లరి నరేష్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నాడు. సీఐ శివకుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. నరేష్ భార్యగా మిర్నా తన నటనతో మెప్పించింది. డాక్ట‌ర్ పాత్ర‌కు ఇంద్ర‌జ పూర్తి న్యాయం చేసింది.

దర్శకుడు విజయ్ రాసుకున్న కథ బాగుంది. అయితే కథనాన్ని ఇంకాస్త ఆసక్తిగా నడిపించి ఉంటే బాగుండేది. సినిమా ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. లవ్ ట్రాక్ కూడా అంత ఆసక్తిని పెంచదు. సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తర్వాతే ట్రాక్ ఎక్కుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మిస్టరీ, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ సెకండాఫ్‌లో ప్రేక్షకుడిలో కాస్త ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

‘నాంది’ మ్యాజిక్‌ను ‘ఉగ్రం’ సినిమాతో నరేష్, విజయ్ రిపీట్ చేయలేక‌పోయారు. రోటీన్ మాస్ యాక్షన్ డ్రామాలా ఉగ్రం సాగింది. యాక్ష‌న్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వారికి కాస్త టైమ్ పాస్ గా ఉంటుంది.

For Ramabanam Movie Review Click Here: రామబాణం మూవీ రివ్యూ

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×