BigTV English

Apples:- యాపిల్‌ పొట్టు అస్సలు తీయకండి..ఎందుకో తెలుసా?

Apples:- యాపిల్‌ పొట్టు అస్సలు తీయకండి..ఎందుకో తెలుసా?


Apples:- ప్రతి రోజు ఒక యాపిల్‌ తింటే వైద్యుడి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. ఎందుకంటే యాపిల్‌లో ఉండే పోషకాలు అన్నీఇన్నీ కాదు. సాధారణంగా మనం యాపిల్‌పై ఉండే పొట్టు తీసేసి తింటుంటాం. కానీ పొట్టుతో పాటు తింటే కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కచ్చితంగా పొట్టుతో పాటే తినాలని సూచిస్తున్నారు. యాపిల్‌ గుజ్జులో కంటే దానిపై ఉండే పొట్టులోనే పోషకాలు అధికం అని చెబుతున్నారు. లోపలి భాగం కంటే 6 రెట్ల అధిక పోషకాలు ఈ పొట్టులోనే ఉంటాయట. పొట్టు తీస్తే ఆ పోషకాలను మనం మిస్‌ అవుతాం. ఇక యాపిల్ పొట్టు 0.3 MM నుంచి 0.5 MM మందం కలిగి ఉంటుంది. ఇది ఫైబ‌ర్‌ను ఎక్కువగా క‌లిగి ఉంటుంది. లోప‌లి గుజ్జు కంటే పొట్టులోనే ఫైబ‌ర్ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. కాబట్టి యాపిల్‌ను పొట్టుతో స‌హా తినాల్సిందేన‌ని వైద్యులు అంటున్నారు. యాపిల్ పండ్ల పొట్టులో పాలిఫినాల్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. కాబట్టి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని బాగా పెంచుతుంది. దీంతో వ్యాధులు మన దరిచేరకుండా ఉంటాయి. యాపిల్ గుజ్జులో కంటే కూడా పొట్టులోనే అధికంగా పొటాషియం, విట‌మిన్ ఇ ఉంటుంది. ఇది 2 నుంచి 4 రెట్లు అధికం. కాబట్టి యాపిల్‌ను పొట్టును తీయ‌కుండానే నేరుగా తింటే మంచిది. మీడియం సైజు యాపిల్‌లో విట‌మిన్ సి 8.5 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. 100 ఐయూ వరకు విట‌మిన్ ఎ ఉంటుంది. పొట్టు తీస్తే వీటి శాతం చాలా త‌గ్గుతుంది. విట‌మిన్ సి 6.5 మిల్లీగ్రాములు, విట‌మిన్ ఎ 60 IU ఉంటుంది. అంటే విట‌మిన్ల శాతం త‌గ్గుతుంది. ఇలా రోజు ఒక యాపిల్ పండును తింటే ఇమ్యూనిటీ పవర్‌ బాగా పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. దీంతో అనేక వ్యాధుల నుంచి మనకు ర‌క్షణ ల‌భిస్తుంది. యాపిల్‌ను తిన‌ని వారి కంటే తినే వారిలోనే వ్యాధులను ఎదుర్కొనే శ‌క్తి బాగా ఉంటుంద‌ని తేలింది. కాబట్టి డైలీ ఒక యాపిల్‌ను కచ్చితంగా తినండి.


Related News

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Big Stories

×