Megastar Chiranjeevi.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి తాజాగా మరో అరుదైన గౌరవం లభించింది. యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటించడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీ రంగంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న సేవలకు గానూ.. ఈ పురస్కారం ఆయనను వరించింది. ఆ దేశ పార్లమెంటులో ఈనెల 19వ తేదీన మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డును బహుకరించనున్నారు. ఏది ఏమైనా చిరంజీవి ఏకంగా ఇండియాలో కాకుండా యూకేలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి అందుకున్న అవార్డులు..
సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి, నేడు మెగాస్టార్ గా చలామణి అవుతూ.. భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న చిరంజీవికి ఎన్నో అవార్డులు లభించిన విషయం తెలిసిందే. కెరియర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని, స్టార్ హీరోగా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన, డాన్సులతో యువతను ఉర్రూతలూగించిన ఈయన, బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు కూడా క్రియేట్ చేశారు. ముఖ్యంగా 9 ఫిలింఫేర్ అవార్డులు,3 నంది అవార్డులతో పాటు పలు అవార్డులు కూడా ఆయనను వరించాయి. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్, 2024లో పద్మ విభూషణ్ కూడా అందించి సత్కరించింది. ఇక 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో అలరించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఆయన చోటు దక్కించుకున్నారు.
చిరంజీవి సినిమాలు..
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసి తన క్రేజ్ మరింత పెంచుకున్న ఈయన.. ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటించి పర్వాలేదు అనిపించిన చిరంజీవి.. ఆ తర్వాత వచ్చిన ‘భోళా శంకర్ ‘ సినిమాతో పూర్తిగా బోల్తా పడ్డారని చెప్పాలి. ఇప్పుడు ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని తపన పడుతున్న ఆయన.. అందులో భాగంగానే ‘బింబిసారా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vassista Mallidi) దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా.. ఈ సినిమాను వాయిదా వేస్తూ ఆస్థానంలో చిరంజీవి వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాను విడుదల చేశారు .అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ విశ్వంభర సినిమా మే నెలలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న చిరంజీవి, ఆ తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో కూడా ఒక కొత్త ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక మొత్తానికి అయితే యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ భారీ పాపులారిటీ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి.
#MegastarChiranjeevi Garu will be honored at the UK Parliament’s House of Commons on March 19, 2025, for his outstanding contributions to cinema & philanthropy.
Boss #Chiranjeevi Garu adds another feather to his cap❤️❤️❤️❤️ pic.twitter.com/dzDeGmZKUk
— Chiru FC™ (@Chiru_FC) March 14, 2025