BigTV English

Unni Mukundhan: నాకు అలవాటే.. పాపం ఆమెకు కొత్త.. అందుకే ఇబ్బంది పడుతుంది

Unni Mukundhan: నాకు అలవాటే.. పాపం ఆమెకు కొత్త.. అందుకే ఇబ్బంది పడుతుంది

Unni Mukundhan updates


Unni Mukundhan updates(Film news in telugu today): మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ గురించి తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కొడుకుగా నటించి మెప్పించాడు. ఈ సినిమా అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. జనతా గ్యారేజ్ తరువాత ఉన్ని.. తెలుగులో మంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. భాగమతి, యశోద, మాలికపురం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఉన్నిపై వివాదాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ అతనిపై కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఒక మైనర్ బాలికపై కారులో ఉన్ని అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని ఉన్ని చెప్పుకొస్తున్నాడు.

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఉన్ని ముకుందన్ ప్రేమ వ్యవహారం ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అనుశ్రీ అనే నటితో అతడు డేటింగ్ లో ఉన్నాడని, వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఉన్ని స్పందించాడు. ప్రస్తుతం అతను.. జై గణేష్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. దీంతో ప్రమోషన్స్ లో పాల్గొన్న ఉన్నికి.. ఈ డేటింగ్ గురించి ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో అతను స్పందించక తప్పలేదు.


“అనుశ్రీతో ఒక సినిమా చేయబోతున్నాను. ఇప్పటివరకు నాకు చాలామంది హీరోయిన్స్ తో డేటింగ్ అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. వాటిని చదివినప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంది. నాతో డేటింగ్ అని వార్తలు వచ్చిన కొన్ని రోజులకే ఆ హీరోయిన్స్ అందరికి పెళ్లిళ్లు అవుతున్నాయి. కొద్దిరోజుల్లో అనుశ్రీ కూడా పెళ్లి చేసుకుంటుందేమో. నాకు ఇవన్నీ కొత్త కాదు. ఈ రూమర్స్ అలవాటు అయ్యాయి. కానీ అనుశ్రీకి కొత్త. అందుకే ఆమె ఇబ్బంది పడుతుంది. ఒత్తిడికి లోనవుతుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×