Allu Arjun – Prabhas : ఏ రంగంలోనైనా పోటీ ఉండడం అనేది సహజంగా జరుగుతుంది. అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలామంది మధ్య ఒక పోటీ నడుస్తుంది. కానీ పెద్దగా దాన్ని ఎవరు బయటపెట్టారు. ఒకప్పుడు సీనియర్ హీరోస్ అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ పేర్లు వినిపించేవి. ఆ తర్వాత కాలంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ వీళ్ళ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోస్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్లు మాత్రమే వినిపించేవి. ఇక ప్రస్తుతం ఉన్న హీరోస్ కూడా మంచి గుర్తింపు సాధించుకొని స్టార్ ఇమేజ్ ని తెచ్చుకున్నారు. ఇప్పుడున్న యంగ్ హీరోస్ అంతా కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధించారు. వాళ్ల సినిమాలు కూడా అదే స్థాయిలో విడుదలవుతున్నాయి. అయితే ఎవరికి వారే ఒక హిట్ సినిమా చేయాలి అని తపన పడుతుంటారు.
ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ఎన్టీఆర్ ను బావ బావ అని పిలుస్తూ ఉంటాడు. అలానే ప్రభాస్ తో కూడా అల్లు అర్జున్ ను కు మంచి పరిచయం ఉంది. ఇంతకుముందు అల్లు అర్జున్ చేసిన చాలా సినిమాలకు ప్రభాస్ గెస్ట్ గా హాజరైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలానే ప్రభాస్, అల్లుఅర్జున్ బయట కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ వీళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే రీసెంట్ గా జరిగిన ఒక టాక్ షో లో అల్లు అర్జున్ ను బాలకృష్ణ అడుగుతూ మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు అన్నారు. దానికి సమాధానంగా బన్నీ మాట్లాడుతూ ” నన్ను అయితే మించినోడు, ఇంకొకడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే” అంటూ పుష్ప సినిమా లిరిక్స్ ను చెప్పాడు. ఈ వీడియో రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
Also Read : Suriya44: సూర్య సినిమాలో ఈ టాప్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేసిందట
దీంతోపాటు ఇప్పుడిప్పుడే ప్రభాస్ వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరణ్ జోహార్ ఒక సందర్భంలో ప్రభాస్ ను ఇప్పుడున్న జనరేషన్ లో మీకు ఎవరు పోటీ అని అనుకుంటున్నారు అని అడగ్గా.. ప్రభాస్ సమాధానం ఇస్తూ ” ఐ డోంట్ థింక్ లైక్ దట్” అన్నాడు. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అల్లు అర్జున్ చాలా గర్వంతో ఆన్సర్ చెప్తే, ప్రభాస్ మాత్రం చాలా కూల్ గా ఆన్సర్ చెప్పాడు. ఇలాంటి మైండ్ సెట్ ఉండాలి అని కొంతమంది వాదనలు చేయడం మొదలుపెట్టారు. ఏదేమైనా ఒకరితో ఒకరికి పోటీ ఉండటం మంచిదే, కానీ నేనే అనే గర్వం ఉండటం మాత్రం కరెక్ట్ కాదు అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.