Prabhas – Hanu Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న గ్రేట్ డైరెక్టర్స్ లో హను రాఘవపూడి ఒకరు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హను. ఈ సినిమా కంటే ముందు చంద్రశేఖర్ ఏలేటి దగ్గర శిష్యరికం చేశాడు. చంద్రశేఖర్ ఏలేటి సినిమాలు ఎలా ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అన్నీ కూడా నిజజీవితంలో పుట్టుకొచ్చిన కథలులా అనిపిస్తాయి. ఎస్.ఎస్ రాజమౌళి వంటి ప్రముఖ దర్శకులు కూడా చంద్రశేఖర్ ఏలేటి వర్క్ ను కొనియాడిన రోజులు ఉన్నాయి. అలానే చాలామంది యంగ్ డైరెక్టర్స్ కి చంద్రశేఖర్ ఏలేటి ఒక ఇన్స్పిరేషన్. చంద్రశేఖర్ ఏలేటి సినిమాలను విపరీతంగా ఇష్టపడిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఆయన దగ్గరే రాధే శ్యాం సినిమాను తీసిన రాధాకృష్ణ కుమార్ కూడా శిష్యరికం చేసాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి ఫౌజీ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read : Suriya44: సూర్య సినిమాలో ఈ టాప్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేసిందట
హను లో ఉన్న ప్రత్యేకత గురించి చాలామంది ప్రేక్షకులకు తెలిసిందే. ఈరోజుల్లో లవ్ స్టోరీ ని అందంగా చూపించగలిగిన దర్శకులు అరుదుగా ఉన్నారని చెప్పాలి. ఇటువంటి దర్శకులలో హనూ పేరు మొదట వినిపిస్తుంది. ఇప్పటివరకు తన కెరియర్ లో ఎక్కువ శాతం లవ్ స్టోరీ సినిమాలు చేశాడు హను. అన్నిటిని మించి దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో దుల్కర్ కి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా ఆల్రెడీ మొదలు పెట్టేసారట. ఈ సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ అయిపోయినట్లు సమాచారం వినిపిస్తుంది. ఇమాన్వి, ప్రభాస్ మధ్యలో కొన్ని కీలక సీన్స్ కూడా షూట్ చేసినట్లు విశ్వసినీయ వర్గాల సమాచారం. ఇక అవి కూడా చాలా అద్భుతంగా వచ్చాయి అని తెలుస్తుంది.
Also Read : Allu Arjun – Prabhas : కాంపిటీషన్ ప్రభాస్ కి అల్లు అర్జున్ కి ఉన్న తేడా అదే
ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ అయింది. ఇప్పుడు ఫౌజి చేసి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోని విడుదల కాబోతుంది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో ఈ కథ జరిగినట్లు వార్తలు వినిపించాయి. ఇదివరకే ఇదే కథను హను నాని కూడా చెప్పినట్లు రుజువైంది. ఏదేమైనా ప్రభాస్ ఒక ప్రాపర్ లవ్ స్టోరీ సినిమా చేసి చాలా ఏళ్ళు అయింది. అయితే ఇది కంప్లీట్ లవ్ స్టోరీ అని చెప్పలేము కానీ హను దర్శకత్వం అంటే లవ్ టచ్ ఖచ్చితంగా ఉంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.