Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898AD) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని.. ఇండియాలో ఎంత లాభాలు వచ్చాయో అమెరికాలో కూడా అదే రేంజ్‌లో కలెక్షన్స్ సాధించిందని మేకర్స్ సంతోషంగా ప్రకటించారు. కానీ అవన్నీ అబద్ధాలను డిస్ట్రిబ్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఈరోజుల్లో ఒక ప్యాన్ ఇండియా మూవీ విడుదలయితే చాలు.. వెంటనే ఒక కొత్త పోస్టర్ విడుదల చేయడం, దానిపై కోట్లలో కలెక్షన్స్ చూపించడం కామన్ అయిపోయింది. ‘కల్కి 2898 ఏడీ’ విషయంలో కూడా అదే జరిగిందని, కానీ అవి పూర్తిగా నిజాలు కావని డిస్ట్రిబ్యూటర్లు ఓపెన్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.
నిర్మాతల తప్పేనా ?
‘కల్కి 2898 ఏడీ’ నిర్మాతలపై నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్లు పలు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. రూ.5 కోట్లు రిఫండెబుల్ అమౌంట్‌తో అగ్రిమెంట్ చేసుకుంటే ఇప్పటివరకు నిర్మాతలు ఆ అమౌంట్‌ను ఇవ్వలేదని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఇప్పటివరకు వారికి కేవలం రూ.2 కోట్లు మాత్రమే వచ్చాయని, రూ.3 కోట్లు ఇంకా రాలేదని తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లకు కూడా సినిమా విడుదల సమయంలో ఖర్చులు ఉంటాయి. అయితే యూరోప్‌లో ‘కల్కి 2898 ఏడీ’ విడుదలకు ఇంత ఖర్చు అయ్యింది అని లెక్కలు చూపించినా.. వాటిని నమ్మడానికి నిర్మాతలు సిద్ధం లేరని అన్నారు. అంత ఖర్చులో కనీసం రూ.5.5 కోట్ల షేర్ రావడం కష్టమని చెప్పేశారు.
Also Read: 10 యేళ్లు..10 సినిమాలు..9 మంది స్టార్ డైరెక్టర్స్..అయినా వరించని అదృష్టం..తప్పెవరిది..?
చట్టపరమైన చర్యలు తప్పవు…
మామూలుగా సినిమా వాళ్ల మధ్య ఇలాంటి గొడవలు కచ్చితంగా చట్టపరమైన చర్యలకు దారితీస్తాయి. ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాతలకు, నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్లకు మధ్య జరుగుతున్న గొడవ కూడా అలాగే ముగిసేలా ఉంది. డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయంపై 48 గంటల్లోపు వివరణ ఇవ్వాలని నిర్మాతలు ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా అసలు ఈ విషయం గురించి నిర్మాతలకు మెయిల్ చేసినప్పుడు వారి రిప్లై ఏంటో పోస్ట్ చేశారు డిస్ట్రిబ్యూటర్లు. ఆ మెయిల్‌లో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను యూరోప్‌లో విడుదల చేయడానికి అయిన ఖర్చులు, షేర్స్, పేమెంట్స్ గురించి వివరించారు నిర్మాతలు. ఇందులో తమ తప్పు ఏం లేదంటూ సమర్ధించుకున్నారు.
లాభాలు వచ్చాయి…
మేము చేయని పనిలోకి మా పేరును లాగుతున్నారంటూ ఈ మెయిల్‌లో వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) వాపోయింది. ఇదంతా విని తాము షాక్ అయ్యామని, ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తే తాము ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాకు సరిపడా లాభాలు వచ్చాయి కాబట్టి తాము ఇచ్చిన రిఫండెబుల్ అమౌంట్‌ను వారికి తిరిగిచ్చేయాలని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు నిర్మాతలు చెప్తుంది నమ్మాలా, డిస్ట్రిబ్యూటర్లు చెప్తుంది నమ్మాలా అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. మొత్తానికి ప్యాన్ ఇండియా సినిమాపై పోస్టర్లపై కనిపించే లెక్కలు చాలావరకు అబద్ధమే అయ్యిండవచ్చని మరోసారి తేలిపోయిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.