BigTV English

PM Modi – Aircraft : ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య.. రాహుల్ గాంధీకి ఇబ్బందులు

PM Modi – Aircraft : ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య.. రాహుల్ గాంధీకి ఇబ్బందులు

PM Modi – Aircraft : జార్ఘండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ(PM Modi).. తిరుగు ప్రయాణ సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో.. జార్ఘండ్ లోని దియోగర్ (Deoghar) విమానాశ్రయంలోనే ప్రధాని విమానాన్ని నిలిపివేశారు. సమస్య ఇంకా పరిష్కారం అవ్వకపోవడంతో.. ప్రధాని కోసం దిల్లీ నుంచి మరో విమానాన్ని అధికారులు జార్ఘండ్‌కు పంపించారు. దాంతో.. ప్రధాని షెడ్యూల్ లో తీవ్రజాప్యం ఏర్పాడినట్లు వెల్లడించారు.


జార్ఘండ్ లో ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా జయంతి వేడుకల సందర్భంగా జన్ జాతీయ గౌరవ్ దివాస్ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అనంతరం నవంబర్ 20న రెండో దశ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో జార్ఘండ్ లో నిర్వహించిన రెండు ర్యాలీల్లో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణ సమయంలో ప్రధాని విమానంలో సాంకేతిక సమస్యను అధికారులు గుర్తించారు. దాంతో.. ప్రయాణాన్ని నిలిపివేసిన అధికారులు, దిల్లీ నుంచి మరో విమానాన్ని తరలిస్తున్నారు.

ఇదే సమయంలో.. దియోగర్ కు 80 కి.మీ దూరంలో రాహుల్ గాంధీ హెలీకాఫ్టర్ టేకాఫ్ కు అనుమతులు లభించలేదు. దాంతో.. ఆయన హెలీకాఫ్టర్.. 45 నిముషాల పాటు నిలిచిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స రావడం ఆలస్యం అవ్వడంతో.. రాహుల్ హెలీకాఫ్టర్ అంతసేపు నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు. అయితే.. ఇందుకు బీజేపీ నే కారణం అంటూ కాంగ్రెస్ పార్టీ(Congress) ఆరోపించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు కల్పించేందుకు బీజేపీ ఇలాంటి పనులు చేస్తోందంటూ ఆరోపణలు చేసింది. అధికారులు రాహుల్ గాంధీ కంటే ప్రధాని మోదీ కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధ్యానతనిస్తున్నారని, అందుకే ఇలాంటి ఆటంకాలు సృష్టి్స్తున్నారంటూ ఆరోపించారు.


Also Read : మోడీకి రాహుల్ గాంధీ కౌంట‌ర్.. ఆయ‌న రాజ్యాంగాన్ని ఎప్పుడూ చ‌ద‌వ‌లేదు!

అంతకుముందు రోజు తన ర్యాలీలలో ప్రధాని మోడీ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగ (ST), వెనుకబడిన తరగతుల (OBC) వర్గాలకు చెందిన వారికి కల్పిస్తున్న రిజర్వేషన్లను రద్దు చేయడానికి కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాంధీ) ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ గతంలో.. రిజర్వేషన్‌ను బానిసత్వానికి చిహ్నమన్నారంటూ ఆరోపించారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×