BigTV English

Mokshagna Debut Movie: మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో మరో ఇద్దరు స్టార్ కిడ్స్.. సినిమాలో ఊహించని సర్‌ప్రైజ్

Mokshagna Debut Movie: మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో మరో ఇద్దరు స్టార్ కిడ్స్.. సినిమాలో ఊహించని సర్‌ప్రైజ్

Mokshagna Debut Movie: నందమూరి కుటుంబం నుండి హీరోలుగా వచ్చిన వారంతా తమ టాలెంట్‌ను నిరూపించుకొని ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. అప్పట్లో తిరుగులేని తెలుగు హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్‌టీఆర్ వారసులు కాబట్టి ఆడియన్స్ వారి నుండి ఎక్కువగానే ఆశించారు. అలా అందరినీ తృప్తిపరిచి ప్రస్తుతం నందమూరి కుటుంబం నుండి వచ్చిన జూనియర్ ఎన్‌టీఆర్, బాలకృష్ణ తిరుగులేని హీరోలుగా వెలిగిపోతున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ వారుసుడు అయిన మోక్షజ్ఞ తేజ డెబ్యూకు రంగం సిద్ధమయ్యింది. తాజాగా ఈ సినిమా నుండి పలు ఆసక్తికరమైన రూమర్స్ బయటికొచ్చాయి.


ప్రశాంత్ వర్మ బాధ్యత…

మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) డెబ్యూ కోసం యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను సెలక్ట్ చేశారు బాలకృష్ణ. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ దర్శకుల్లో ప్రశాంత్ వర్మనే వేరే లెవెల్‌లో ఉన్నాడు. ఆయన డైరెక్ట్ చేసే సినిమాలు కచ్చితంగా బాగుంటాయని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఈ సమయంలో మోక్షజ్ఞ డెబ్యూను ప్రశాంత్ వర్మ (Prasanth Varma) చేతిలో పెట్టి ధీమాగా ఉన్నారు బాలయ్య. కానీ ఒక స్టార్ వారసుడి డెబ్యూకు దర్శకుడు సెట్ అయితే చాలదు కదా.. అందులో హీరోయిన్, విలన్ లాంటి ఇతర ముఖ్య పాత్రల్లో కూడా ఎవరు నటిస్తే సినిమాకు మరింత హైప్ వస్తుంది అనే ఆలోచన కూడా ఉంటుంది. అందుకే ఈ రెండు పాత్రల కోసం కూడా మరో ఇద్దరు స్టార్ కిడ్స్‌నే సెలక్ట్ చేశారట మేకర్స్.


Also Read: బాబీ చితక్కొట్టాడు పర్ఫెక్ట్ మాస్ బొమ్మ, బాలయ్య బాబు సంభవం

స్టార్ కిడ్సే కావాలి…

ముందుగా మోక్షజ్ఞ డెబ్యూ సినిమాలో తనకు జోడీగా రవీనా టండన్ వారసురాలు అయితే బాగుంటుందని మేకర్స్ అనుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా బాలీవుడ్ నెపో కిడ్ సారా అలీ ఖాన్‌ (Sara Ali Khan)ను మోక్షజ్ఞ సరసన హీరోయిన్‌గా నటించడానికి సెలక్ట్ చేశారని సమాచారం బయటికొచ్చింది. మొత్తానికి బాలీవుడ్ నుండే ఎవరో ఒక స్టార్ కిడ్‌ను మోక్షజ్ఞకు జోడీగా ఫైనల్ చేసే అవకాశం ఉందని మాత్రం అర్థమవుతోంది. అదే విధంగా విలన్‌గా కూడా ఒక స్టార్ కిడ్కే ఉంటే సినిమాకు మరింత హైప్ వస్తుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ మరొక భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.

ఇదే మంచి అవకాశం…

మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో విలన్‌గా విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ పేరు పరిగణిస్తున్నట్టు టాలీవుడ్‌లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే చాలామంది తమిళ హీరోలకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. వారు నేరుగా తెలుగులో సినిమాలు చేసినా చేయకపోయినా ఇక్కడ మార్కెట్ మాత్రం భారీగానే ఉంది. ఇప్పుడు యంగ్ హీరోలు కూడా తెలుగు మార్కెట్‌పైనే కన్నేశారు. ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) కూడా తెలుగులో పాపులారిటీ సంపాదించుకోవాలని అనుకుంటే ఇదే మంచి అవకాశమని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు పురాణాలతో కనెక్షన్ ఉంటుందని, ఇందులో బాలయ్య శ్రీకృష్ణుడిగా, మోక్షజ్ఞ అభిమన్యుడిగా కనిపించనున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×