Nagarjuna : ఆంధ్రప్రదేశ్ లో వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ వరదల్లో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) చిక్కుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయంపై ఇప్పుడు నాగ్ స్పందించారు. ఆయన ఏమన్నారో తెలుసుకుందాం పదండి.
వరదల్లో చిక్కుకున్న నాగ్…
అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పడమేరు వాగు ఉదృతంగా ప్రవహించడంతో వరద నీరు పొంగిపొర్లుతోంది.. దీంతో ఇప్పటికే అక్కడ పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో పాటు కార్లు, బైకులు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి. సత్య సాయి జిల్లాలో ప్రస్తుతం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడడంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోగా, స్టార్ హీరో నాగార్జున (Nagarjuna)కు విచిత్రమైన అనుభవం ఎదురయిందని వార్తలు వినిపించాయి. ఆయన వరదలలో చిక్కుకున్నారు అనే రూమర్లు అభిమానులను ఆందోళనకు గురి చేశాయి.
ఆ వార్తలన్నీ ఫేక్
మంగళవారం ఉదయం ప్రైవేట్ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి అనంతపురం వెళ్ళిన ఆయన తిరిగి వస్తుండగా, మధ్యలో ఇరుక్కుపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే మార్గ మధ్యలో పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న సమయంలో నాగార్జున (Nagarjuna) వరదల్లో చిక్కుకున్నట్టుగా టాక్ నడుస్తోంది. దీంతో అప్రమత్తమైన ఆయన ఫాలోవర్స్ అక్కడి నుంచి నాగార్జునను మరో రూట్ లో నుంచి అనంతపురంకు సేఫ్ గా తరలించడంతో పెను ప్రమాదం తప్పిందని వార్తలు రాగా, ఆయన అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు. ఈ నేపథ్యంలోనే నాగర్జున ఆ వార్తలపై విషయంపై స్పందించారు. సన్నిహితులతో వీడియో కాల్ ద్వారా నాగార్జున స్పందిస్తూ తను క్షేమంగా ఉన్నానని చెప్పారు. కాగా ప్రస్తుతం ఆయన ఓ సపరేట్ కార్లో ప్రయాణిస్తుండగా, పరిస్థితి బాగుంటే షాప్ ఓపెనింగ్ లో పాల్గొంటారని, లేకపోతే మళ్లీ అనంతపురం నుంచి రిటర్న్ అవుతారని తెలుస్తోంది. ఇక నాగార్జున బెంగళూర్ నుంచి అనంతపురంకి ఫ్లైట్లో వెళ్లారు. ఇప్పుడు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసిన అక్కినేని అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
కాగా ఇటీవల కాలంలో నాగార్జున సినిమాలతోనే కాకుండా వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. అక్కినేని కుటుంబంపై కొండా సురేఖా (Konda surekha) చేసిన కామెంట్స్ ఎంతటి దూమరాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ కుటుంబం ప్రతిష్టను దిగజార్చేలా ఆమె చేసిన కామెంట్స్ పై చర్యలు తీసుకోవలంటూ నాగ్ కోర్టు మెట్లు ఎక్కారు. మరోవైపు నాగ్ తనయుడు నాగ చైతన్య (Naga Chaitanya) రెండవ పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. చై హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల (Shobhitha Dhulipala)ను రెండవ పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగ్గా, తాజాగా శోభిత ఇంట హల్దీ వేడుకల హంగామాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.