Upasana Kamineni:ఉపాసన కొణిదెల (Upasana Konidela) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) భార్యగా.. మెగాస్టార్ చిరంజీవి కోడలుగా.. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ గా సమాజంలో ఎంతో మంచి గుర్తింపు ఉంది. రామ్ చరణ్ (Ram Charan) భార్య కాకముందు ఉపాసన పేరు ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే రామ్ చరణ్ ని పెళ్లి చేసుకుందో అప్పటి నుండి స్టార్ సెలబ్రెటీల లిస్టులో చేరిపోయింది ఉపాసన. అయితే రామ్ చరణ్ – ఉపాసన(Ram Charan- Upasana) పెళ్లి విషయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎందుకంటే చరణ్ ఉపాసనని పెళ్లి చేసుకున్న సమయంలో ఉపాసన అంత అందంగా లేదు. కాస్త బొద్దుగా ఉండడంతో చాలామంది విమర్శలు చేశారు. కానీ ఇప్పుడున్న ఉపాసనకి అప్పుడున్న ఉపాసనకి చాలా డిఫరెన్స్ ఉంది. పైగా పెళ్లయిన పదేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో ఉపాసనపై చాలామంది విమర్శలు గుప్పించారు. ట్రోల్స్ కూడా చేశారు.
పిల్లల్ని కనడం పై అలాంటి సలహా ఇస్తున్న ఉపాసన..
ఇక ఉపాసనకి పిల్లలు పుట్టరని, అసలు వారికి పిల్లల్ని కనే ఆలోచన కూడా లేదని ఇలా ఎన్నో రూమర్లు వినిపించాయి. కానీ ఎట్టకేలకు ఆ రూమర్లన్నింటికి తెర దించుతూ ఉపాసన క్లీంకారా(Klinkaara)కి జన్మనిచ్చింది. క్లీంకారా రాకతో అందరి విమర్శలకు చెక్ పెట్టింది ఉపాసన. అయితే పిల్లల్ని కనే విషయంలో ఉపాసన తాజాగా ఒక సలహా కూడా ఇచ్చింది. అదేంటంటే పిల్లల్ని కనే విషయంలో ఆధునిక పద్ధతులను ఎంచుకోవాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.అందులో ఉపాసన (Upasana ) ఏం మాట్లాడిందంటే.. మహిళలు ఎవరైనా పిల్లల్ని కనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.అలాగే ఆధునిక పద్ధతులను ఎంచుకోవాలి. చాలామంది పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనాలి అనుకోరు. అలాగే కొంతమంది లేటుగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు.అలాంటి వారు యుక్తవయసులోనే ఎగ్ ఫ్రీజింగ్ (అందాలను భద్రపరచడం) చేసుకోవడం అనేది ఒక మంచి పద్ధతి. ఈ ఎగ్ ఫ్రీజింగ్ వల్ల పిల్లల్ని ఎప్పుడు కనాలనునుకుంటే అప్పుడు కనవచ్చు. వయసు మీద పడుతుంది అనే ఇబ్బంది ఉండదు.అందుకే యంగ్ ఏజ్ లోనే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం ఒక మంచి పద్ధతి అంటూ ఉపాసన(Upasana) చెప్పుకొచ్చింది. ఇక ఉపాసన మాటలకు చాలామంది మద్దతిస్తున్నారు.
ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిని అవలంబించిన హీరోయిన్స్ వీళ్ళే..
ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది లేట్ ఏజ్ లో పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొంత మందేమో పెళ్లి అయిన వెంటనే పిల్లల్ని వద్దనుకుంటున్నారు. అలాంటి వారికి ఉపాసన చెప్పిన ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈ ఎగ్ ఫ్రీజింగ్ లిస్టులో మన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఆ మధ్యకాలంలో మెహ్రీన్ ఫిర్జాదా(Mehreen Pirzada) కూడా తన ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే . అలాగే మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur ) కూడా ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి మంచిదేనని,నేను కూడా భవిష్యత్తులో దీని గురించి ఆలోచిస్తానని చెప్పింది. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలే కాకుండా మాజీ మిస్ ఇండియా అయినటువంటి ఈషా గుప్తా(Esha Gupta) కూడా ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిని అనుసరించానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలా ఈ ఎగ్ ఫ్రీజింగ్ వల్ల పెళ్లి ఏ ఏజ్ లో అయినా చేసుకోవచ్చు. అలాగే పిల్లల్ని కూడా ఏ ఏజ్ లోనైనా కనచ్చు.. పిల్లల్ని కనే విషయంలో ఇలాంటి ఆధునిక పద్ధతి పాటించడం చాలా మంచిది అంటూ ఉపాసన చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఉపాసన (Upasana) ఇదే కాదు సమాజానికి ఉపయోగపడే ఎన్నో సలహాలు చాలా ఇంటర్వ్యూలలో ఇచ్చింది.