BigTV English

Klinkaara Konidela: అప్పుడే మొదటి అడుగు వేసిన మెగా వారసురాలు.. ఎంత ముచ్చటగా ఉందో

Klinkaara Konidela: అప్పుడే మొదటి అడుగు వేసిన మెగా వారసురాలు.. ఎంత ముచ్చటగా ఉందో

Klinkaara Konidela: మెగా ఫ్యామిలీకి అదృష్టం పట్టింది. ఆ అదృష్టం పేరు క్లింకార. ఎప్పటినుంచో మెగా ఫ్యామిలీకి ఉన్న నెగెటివిటీని ఈ చిన్నది చెరిపేసింది. ఏ ముహూర్తంలో ఈ చిన్నారి పుట్టిందో.. అప్పటినుంచి మెగా ఇంటి నుంచి అదృష్టం పోనని తిష్ట వేసుకొని కూర్చోంది. మెగాస్టార్ కు పద్మ విభూషణ్ తీసుకొచ్చి పెట్టింది. పవర్ స్టార్ ను ఏకంగా మంత్రిని చేసింది. అంతా క్లింకార లక్ నే. రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు దాదాపు పదేళ్ల తరువాత పుట్టిన సంతానం.


2012 లో రామ్ చరణ్ – ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉపాసనను పెళ్ళిలో చేసి చాలామంది విమర్శించారు. ట్రోల్ చేశారు. అబ్బాయిలా ఉందని యెగతాళి చేశారు. చరణ్ కు తగిన జోడి కాదని, ఆస్తి కోసం, డబ్బు కోసం చేసుకున్నారని లా రకరకాలుగా మాట్లాడుకున్నారు. పెళ్లితో ఈ ట్రోలింగ్ ఆగలేదు. పదేళ్లు అవుతున్నా పిల్లలు కలగడం లేదంటే ఏదో లోపం ఉందన్నారు. అసలు ఉపాసనకు తల్లి అయ్యే యోగం లేదని విమర్శించారు. ఇలా ఎన్ని అన్నా ఉపాసన కృంగిపోలేదు. ఒక బిజినెస్ విమెన్ గా ఎదిగింది. తనను తాను మార్చుకుంది.

మెగా కోడలిగా, స్టార్ హీరో భార్యగా, అపోలో సంస్థలను నడిపే మేనేజింగ్ డైరెక్టర్ గా అన్ని పాత్రలను సమర్థవతంగా పోషించింది. తల్లిదండ్రులుగా తాము అన్ని సంపాదించుకున్నాకా.. తమ టైమ్ మొత్తాన్ని పిల్లలకు ఇవ్వడానికి ఈ పదేళ్లు కష్టపడి ఒక మంచి సామ్రాజ్యాన్ని స్థాపించుకొని అప్పుడు ఉపాసన.. క్లింకారకు జన్మనిచ్చింది. ఇక చరణ్ సైతం కూతురు రాకతో పూర్తిగా మారిపోయాడు. కొద్దిగా సమయం దొరికినా క్లింకార దగ్గర వాలిపోతున్నాడు.


ఇప్పటివరకు మెగా వారసురాలి ఫోటో కూడా చూపించని ఈ జంట.. తాజాగా తన చిన్నారి మొదటి అడుగు వేస్తున్న ఫోటోను షేర్ చేశారు. మరో 5 రోజులు పోతే క్లింకార మొదటి పుట్టినరోజు వస్తుంది. అప్పుడే ఈ చిన్నారి పుట్టి ఏడాది అవుతుంది. నిన్న చరణ్- ఉపాసన 12 వ వివాహ వార్షికోత్సవం కావడంతో.. అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తమను విష్ చేసిన వారందరికీ ఉపాసన థాంక్స్ చెప్పుకొచ్చింది. క్లింకారను ఇద్దరు రెండు చేతులతో పట్టుకొని ఉండగా.. మెగా వారసురాలు బుడిబుడి అడుగులు వేస్తూ నడుస్తున్న ఫోటోను ఉపాసన షేర్ చేసింది.

” ఇక్కడ 12 సంవత్సరాల కలయిక. మీ ప్రేమ & శుభాకాంక్షలకు అందరికీ ధన్యవాదాలు. మా జీవితాలను నిజంగా అద్భుతంగా మార్చడంలో మీలో ప్రతి ఒక్కరు ప్రత్యేక పాత్ర పోషించారు.చాలా కృతజ్ఞతలు” అంటూ రాసుకొచ్చింది, వెనుతిరిగి ఉండడంతో వారి ముఖాలు కనిపించలేదు. కానీ, ఎంతో చూడముచ్చటైన కుటుంబం అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×