BigTV English

Upasana: క్లీంకార కోసం స్పెషల్ రూమ్.. ఉపాసన వీడియో వైరల్..

Upasana: క్లీంకార కోసం స్పెషల్ రూమ్.. ఉపాసన వీడియో వైరల్..

Upasana: ఇటు మెగా కుటుంబం.. అటు అపోలో ఫ్యామిలీ. మామూలుగా ఉంటుందా మరి. ఉపాసన డెలివరీ కోసం హాస్పిటల్‌లో ఓ బ్లాక్ మొత్తం బుక్ చేశారని అన్నారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చాక.. ఆ పాపకు ‘క్లీంకార’ అని పేరు పెట్టారు. ఇప్పుడు క్లీంకార కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తన పుట్టింట్లో.. కూతురు ఉండే గదికి.. స్పెషల్‌గా ఇంటీరియర్ రెడీ చేయించారు ఉపాసన. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.


పాల పొంగులా.. తెల్లని మేఘంలా.. తళతళ మెరిసిపోతోంది ఆ గది. రూమ్ అంతా వైట్ అండ్ వైట్. కంటికి, మనసుకు ఆహ్లాదకరంగా అనిపించేలా తీర్చిదిద్దారు. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ పవిత్రా రాజారామ్‌ ఆ ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు.

చెట్లు, ఫలాలు, జంతువులు.. ఇలా అమ్రాబాద్‌ ఫారెస్ట్‌ థీమ్‌తో కర్టెన్లు తీర్చిదిద్దారు. లలితా సహస్ర నామం నుంచి తీసుకున్న క్లీంకార పేరుకు తగ్గట్టుగా.. గదిలో వేదిక్‌ హీలింగ్‌ అంశాల స్ఫూర్తితో తళుకులు అద్దారు. ఆ ఇంటీరియర్‌ను రెడీ చేసిన విధానం మొత్తాన్ని వీడియోలో చూపించారు. ఉపాసన పోస్ట్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×