BigTV English

This Week OTT & Theater Releases: ఈవారం థియేటర్, ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే!

This Week OTT & Theater Releases: ఈవారం థియేటర్, ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే!
Upcoming Movies

This Week Theater, OTT Release movies and series List: సంక్రాంతి తర్వాత గతవారం అన్నీ చిన్న సినిమాలే విడుదల అయ్యాయి. హనుమాన్ హవా ఇంకా తగ్గకపోవడంతో.. వాటికీ పెద్దగా కలెక్షన్లు రాలేదు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాకపోతే.. ఈ సినిమాలు వెంటనే ఓటీటీ వైపు చూస్తున్నాయి. మరి ఈవారం థియేటర్, ఓటీటీల్లో అలరించే చిత్రాల జాబితా ఏంటో చూసేయండి.


రవితేజ కథానాయకుడిగా ఘట్టమనేని కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈగల్. సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కాని కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో వెనక్కి తగ్గంది. ఇప్పుడు ఈ మూవీ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కథానాయకులు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి జాదేవ్ సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్ గా సాగే ఓ మంచి యాక్షన్ థ్రిల్లర్ ఈగల్, రవితేజ ఇంతకు ముందెన్నడూ చేయని ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం చెబుతోంది.

రజినీకాంత్ మూవీ లాల్ సలామ్ కూడా సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమానే. కానీ.. పోటీ ఎక్కువగా ఉండటంతో అప్పుడు తప్పుకుంది. లాల్ సలామ్ కూడా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజినీ కాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని ఆయన కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించింది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోగా నటించారు. ఈ సినిమాలో భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. క్రికెట్ ఆట చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్ కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. రజినీ ఇందులో మొయిద్దీన్ భాయ్ పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.


పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు. 2012లో వచ్చిన ఈ మూవీ రీ రిలీజ్ కు సిద్దమైంది. ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. యాత్ర 2 సినిమా కూడా ఫిబ్రవరి 8న థియేటర్ లో విడుదలవుతుంది. నటీనటులు మమ్ముట్టి , జీవా ఈ సినిమాలో తండ్రికొడుకులుగా కనిపించనున్నారు. మహి వి.రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు.

మణికందన్, శ్రీ గౌరీ ప్రియ, కన్న రవి కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ట్రూ లవర్. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల మోడరన్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుంది.

మహేష్ బాబు కథానాయకుడి గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా.. కుటుంబం కథా నేపథ్యంలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ మూవీ ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ధనుష్‌ (Dhanush) హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయిక. సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఓటీటి వేదికగా స్ట్రీమింగ్ కానున్న మరికొన్ని చిత్రాలు
నెట్ ఫ్లిక్స్
వన్ డే (హాలీవుడ్)ఫిబ్రవరి 8
భక్షక్(హిందీ సిరీస్)ఫిబ్రవరి 9
జియో సినిమా
ఎ ఎగ్జార్స్ ట్(హాలీవుడ్) ఫిబ్రవరి 6
ది నన్ (హాలీవుడ్) ఫిబ్రవరి 7
హలో (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 9
బబుల్ గమ్ (ఆహా, ఫిబ్రవరి9)
అయలాన్ (తమిళ్, సన్ నెక్ట్స్)

Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×