BigTV English

Pakistan : పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉగ్రదాడి.. 10మంది పోలీసులు మృతి

Pakistan: పాకిస్థాన్‌లో ఈ నెల8 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్ది పాకిస్థాన్‌లో పలు చోట్ల హింస, ఉగ్రవాద ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. బలూచిస్థాన్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల పేలుడు ఘటన ఇంకా చల్లారలేదు.

Pakistan : పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉగ్రదాడి.. 10మంది పోలీసులు మృతి
Pakistan terror attack

Pakistan terror attack (news paper today):


పాకిస్థాన్‌లో ఈ నెల8 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ పాకిస్థాన్‌లో పలు చోట్ల హింస, ఉగ్రవాద ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. బలూచిస్థాన్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల పేలుడు ఘటన ఇంకా చల్లారలేదు. మరోసారి ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో రెచ్చిపోయారు. పోలీస్‌లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు భారీ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలోని జరిగింది.

ఈ ఉగ్రదాడిలో పది మంది పోలీసులు మరణించారని పోలీసు అధికారి అనిసుల్ హసన్ ప్రకటించారు. ఆరుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించామని వారి పరిస్థితి విషమంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఘటనలో గాయపడిన క్షతగాత్రులందరినీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు అనిసుల్ హసన్ వెల్లడించారు.


సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మొదటిగా గుర్తు తెలియని ఉగ్రవాదులు మొదట స్నిపర్ షాట్‌లు పేల్చి చౌదవాన్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారన్నారు. స్టేషన్ లో ఉన్న పోలీసులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత వారితో పాటు తీసుకు వచ్చిన హ్యాండ్‌ గ్రెనేడ్‌లను ప్రయోగించారు.

దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు స్వాబీ ఎలైట్ పోలీసు యూనిట్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఎన్నికల సమయంలో స్థానిక పోలీసులకు సహాయం చేయడానికి ఈ ప్రాంతంలో మోహరించినట్లు వెల్లడించారు. దాడి తర్వాత పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కోసం దక్షిణ వజీరిస్థాన్ గిరిజన జిల్లా, డేరా ఘాజీ ఖాన్‌కు వెళ్లే రహదారులపై పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతం మీదగా వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణంగా పరిశీలిస్తున్నారు పోలీసు సిబ్బంది.

గతంలో జూలై 4 ఆదివారం బలూచిస్తాన్‌లోని నుష్కీ జిల్లాలోని పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ECP) కార్యాలయం వెలుపల మరో బాంబు పేలుడు జరిగింది. పేలుడు ఘటన ఈసీపీ కార్యాలయం గేటు బయట జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్నికలకు ముందు వరుస బాంబుదాడులు జరగడంతో పాకిస్థాన్ ప్రజలు భయపడిపోతున్నారు.

Tags

Related News

Anantapur Crime: గర్భిణి ఆత్మహత్య.. వారి పేర్లు చెబుతూ వాయిస్ రికార్డు.. అడ్డంగా బుక్కైన పోలీసులు

Bihar gang: హైదరాబాద్‌లో బీహార్ గ్యాంగ్ అలర్ట్.. చర్లపల్లిలో మూడు పిస్టల్స్ స్వాధీనం!

Rave Party: బర్త్ డే పేరుతో రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో 51 మంది, డ్రగ్స్ స్వాధీనం

Srikakulam Crime: వాట్సాప్‌లో అమ్మాయి పేరుతో చాటింగ్.. తర్వాత నిద్ర మాత్రలు ఇచ్చి.. ప్రియుడిని పిలిచి.. భర్త హత్య

Jadcherla Incident: లారీని ఢీ కొన్న బస్సు .. స్పాట్‌లో కూకట్‌పల్లి వాసులు

Hyderabad News: హైదరాబాద్‌లో పాక్ యువకుడి రాసలీలలు.. భార్యకి చిక్కాడు, అసలు స్కెచ్ అదేనా?

Big Stories

×