BigTV English

UI The Movie : ఎన్నాళ్లు అయింది ఇలాంటి ఉపేంద్ర సినిమాలను చూసి… మేకింగ్ వీడియోకే పిచ్చేక్కిపోతుంది..

UI The Movie : ఎన్నాళ్లు అయింది ఇలాంటి ఉపేంద్ర సినిమాలను చూసి… మేకింగ్ వీడియోకే పిచ్చేక్కిపోతుంది..

UI The Movie : కన్నడ పాన్ ఇండియా స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు లో కూడా స్టార్ హీరోలతో కలిసి వరుస హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఎక్కువగా సినిమాలు చెయ్యక పోయిన స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్లో నటించి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో ‘యూఐ’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఉపేంద్ర బర్త్ డే సందర్బంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడేమో మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.


ఈరోజు రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఉపేంద్ర అశ్వంపై యుద్ద వీరుడిలా కనిపిస్తున్న లుక్ గూస్‌ బంప్స్ తెప్పిస్తూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది. ఇండస్ట్రీలో నిబంధనలను నిర్వచిస్తూ ఓ వెలుగు వెలిగిన రియల్ స్టార్ ఉపేంద్రకు హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. మేకింగ్‌ లో హిస్టరీ. సినిమాను మరోసారి పునర్నిర్వచించేందుకు ఉపేంద్ర ఈ అక్టోబర్‌లో కీర్తి మార్గంలో రాబోతున్నాడంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు పాన్ ఇండియా లెవల్ లో సినిమాను రిలీజ్ చెయ్యబోతున్న నేపథ్యంలో పాన్ ఇండియా వైడ్ దండయాత్రకు సిద్ధం అని పేర్కొన్నారు.. ఆ లుక్ ను చూస్తే భయంకరమైన యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. దానికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

upendra ui the movie making video viral in social media
upendra ui the movie making video viral in social media

ఇదిలా ఉండగా ఈ మూవీ మేకింగ్ వీడియోను టీమ్ రిలీజ్ చేశారు. ఆయనే డైరెక్టర్ గా, హీరోగా ఎలా చేస్తున్నాడో అన్న సీన్స్ ను వీడియో లో చూపించారు. ఉపేంద్రను గతంలో ఎన్నడూ చూడని విధంగా సినిమాలో చూడవచ్చు అని తాజాగా విడుదలైన పోస్టర్, మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయింది. ఇది చూసిన ఉపేంద్ర ఫ్యాన్స్ ఇది కదా మేము కోరుకొనేది అంటూ కామెంట్స్ చేస్తూ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై మీరు ఓ లుక్ వేసుకోండి మరి..


ఇకపోతే ఈ మూవీలో రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ మూవీకి కాంతార ఫేమ్‌ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటం తో అంచనాలు భారీగానే ఉన్నాయి. దీన్ని ఉపేంద్ర టీం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. యూఐ అనౌన్స్‌మెంట్ వీడియో నెట్టింట టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఈ మూవీని లహరి ఫిలిమ్స్‌, వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌ సంయుక్త నిర్మాణం లో తెరకెక్కిస్తున్నారు.. మేకింగ్ వీడియో ఆకట్టుకుంది మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×