E-Paper
Advertisement

Kumari Aunty: కుమారి ఆంటీ గొప్ప మనసు.. సీఎం కు రూ. 50 వేలు చెక్కు అందజేత

Kumari Aunty: కుమారి ఆంటీ గొప్ప మనసు.. సీఎం కు రూ. 50 వేలు చెక్కు అందజేత
Advertisement

Kumari Aunty: మీది మొత్తం 1000 అయ్యింది .. రెండు లివర్లు ఎక్స్ట్రా. ఈ ఒక్క డైలాగ్ చాలు  ఆమెను పరిచయం చేయాలంటే. ఆమె ఎవరో కాదు  కుమారి ఆంటీ. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ ఎదురుగా  ఓకే ఫుడ్ స్టాల్ ను పెట్టుకొని  తమ దగ్గరకు వచ్చేవారిని ఎంతో ఆప్యాయంగా పలకరించి వడ్డిస్తుంది. అలా  ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆమె రెండు తెలుగురాష్ట్రాల్లో స్టార్ సెలబ్రిటీగా మారింది.

ఇక తాజాగా కుమారి ఆంటీ తన గొప్ప మనసును చాటుకుంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన విషయం తెల్సిందే.   ఈ వరదల వలన ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. ఇక ఈ వార్త బాధితులకు అండగా టాలీవుడ్  ఇండస్ట్రీ నిలబడింది.  ఎంతోమంది స్టార్స్..  ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ప్రకటించారు.  తాజాగా కుమారి ఆంటీ కూడా తన వంతు సాయం అందించింది.

Advertisement

Vettaiyan: అబ్బబ్బా.. ఏమున్నాడ్రా బాబు రానా.. నెక్స్ట్ లెవెల్ అంతే

కుమారీ ఆంటీ తనవంతుగా రూ. 50 వేలు అందించింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ. 50 వేలు చెక్కును అందజేసింది. కుమారి ఆంటీని సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు కుమారి ఆంటీ గొప్ప మనసును ప్రశంసిస్తున్నారు. గతంలో కుమారి ఆంటీ స్టాల్ ను అధికారులు తీసివేసినప్పుడు సమ్మె రేవంత్ రెడ్డి స్వయంగా ఆ సమస్యను పరిష్కరించారు.

Advertisement

అప్పుడు కుమారి ఆంటీ.. రేవంత్ రెడ్డిని  కలిస్తే.. ఆయనకు నచ్చిన వంటలు అన్ని వండి పెడతాను అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు సీఎం ను కలిసే ఛాన్స్ వచ్చింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. నిజం చెప్పాలంటే.. కుమారి ఆంటీకి వచ్చిన గుర్తింపును  చూసి చాలామంది ఈసారి బిగ్ బాస్ లోకి ఆమె కూడా కంటెస్టెంట్ గా వస్తుందని అనుకున్నారు.

Devara: రెడ్ సీ.. ఏం సాంగ్ రా బాబు.. పోవడంలేదు మైండ్ లో నుంచి..

అందిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఆమెను సంప్రదించిందని, ఆమె నిరాకరించిందని టాక్. ఏదిఏమైనా కుమారి ఆంటీ ఇంత గొప్ప మనసు చూపించడం చాలా గ్రేట్ అని, కోట్లు ఉన్న స్టార్స్ కూడా డొనేషన్ ఇవ్వకుండా తప్పించుకున్నారు.. కుమారి ఆంటీ మాత్రం ఉన్నంతలో హెల్ప్ చేసింది సూపర్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×