BigTV English

Upendra: ఉపేంద్ర లవ్ స్టోరీ.. సినిమా తీసేయెచ్చు భయ్యా..!

Upendra: ఉపేంద్ర లవ్ స్టోరీ.. సినిమా తీసేయెచ్చు భయ్యా..!

Upendra.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే కొంతమంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే, మరి కొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకుంటారు. ఇంకొంతమంది సోషల్ మీడియా పరిచయం ద్వారా వివాహాలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ కన్నడ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర (Upendra ) కూడా అలాగే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఈయన ప్రేమ ఎప్పుడు మొదలైంది..? ఎలా మొదలైంది..? ఎవరితో మొదలయ్యింది..? అనే విషయాలు తెలిస్తే మాత్రం నిజంగా ఒక సినిమా తీసేయొచ్చు అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయాలన్నీ కూడా ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర (Priyanka Upendra) చెప్పుకొచ్చారు. ఉపేంద్ర లవ్ స్టోరీ ఆయన భార్య మాటల్లోనే విందాం.


ఉగ్రావతారంతో వస్తున్న ఉపేంద్ర భార్య..

తాజాగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సతీమణి, ప్రముఖ హీరోయిన్ ప్రియాంక ఉపేంద్ర నటించిన పాన్ ఇండియా యాక్షన్ చిత్రం ఉగ్రావతారం. ప్రియాంక ఉపేంద్ర కీలకపాత్ర పోషించగా.. సుమన్, అజయ్, నటరాజ్, సాయిధీన, లక్ష్య శెట్టి, పవిత్ర లోకేష్ ,సుదీ కాక్రోచ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. SGC ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్ జి సతీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గురుమూర్తి దర్శకత్వం వహించారు. నవంబర్ 1వ తేదీన పాన్ ఇండియా వైడ్ గా విడుదల కాబోతోంది. ఈ మేరకు నిర్వహించిన ఒక కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు , సత్య ప్రకాష్ పాటను విడుదల చేయగా.. నిర్మాత రాజ్ కందుకూరి ట్రైలర్ ను విడుదల చేశారు.


లవ్ స్టోరీ రివీల్ చేసిన ప్రియాంక ఉపేంద్ర..

ఇకపోతే ఈ సినిమా గురించి, అలాగే తన ప్రేమ గురించి బయట పెట్టింది ప్రియాంక ఉపేంద్ర. హీరోయిన్ ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ. నాకు హైదరాబాదు తో చాలా మంచి అనుబంధం ఉంది..ఎందుకంటే ఉపేంద్ర ను మొదటిసారి నేను ఇక్కడే కలిసాను. ఆయనతో ప్రేమలో పడ్డాను. నిజంగా మా ప్రేమ ఒక అద్భుతం అంటూ తమ ప్రేమ విషయాన్ని చెప్పుకొచ్చింది ప్రియాంక ఉపేంద్ర. మొత్తానికైతే ఇది విన్న నెటిజన్స్ ఒక సినిమా తీసేయచ్చు మేడం అంటే సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే హైదరాబాదు నాకు చాలా లక్కీ సిటీ అనే చెప్పాలి. నా సినీ కెరియర్లో ఇదే మొదటి యాక్షన్ ఫిలిం. గురుమూర్తి గారి వల్ల తాను ఈ సినిమాలో నటించానని.. తను నమ్మి ఈ పాత్రకు సెట్ అవుతానని ఆయనే చాలా బలంగా నమ్మారని తెలిపింది. కెమెరామెన్ నందకుమార్ అందరికీ చాలా బాగా చూపించారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అలాగే నటరాజ్ అద్భుత నటన గురించి ఆమె ప్రస్తావించారు. నవంబర్ 1న మా సినిమా రాబోతోంది మొదటి పాన్ ఇండియా చిత్రం కచ్చితంగా అందరూ చూడండి అంటూ ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర కోరారు.

సినిమా స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్..

సమాజంలో జరిగే అన్యాయాలను, అఘాయిత్యాలను మీడియా ప్రశ్నించి ఎదిరించగలదు. అయితే ఈ చిత్రాన్ని అటువంటి సమస్య మీదే తీసాము. మంచి సందేశాత్మక చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. సమాజంలో జరిగే అంశాలపై కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కూడా వస్తుంది. ప్రియాంక , నటరాజ్ ఇద్దరు కూడా అద్భుతంగా నటించారు అంటూ కథలోని కొన్ని అంశాలు లీక్ చేశారు డైరెక్టర్.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×