Urfi Javed : బాలీవుడ్ హాట్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ ( Urfi Javed ) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బిగ్ బాస్ ద్వారా హాట్ బ్యూటిగా పేరు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత విచిత్ర వేషదారణతో రోజుకో వింత అవతారం ఎత్తుతు జనాలకు చిరాకు తెప్పిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆమె ప్రవర్తన చూసి స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చెయ్యడం తో పాటుగా ఆమె పై చెయ్యి చేసుకునేవరకు వెళ్లారు. కానీ ఆమె చేస్తున్న పనిని మాత్రం ఆపలేదు. డిఫరెంట్ డ్రెస్సులతో వెరైటీ ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అయితే ఎప్పుడు విచిత్రమైన డ్రెస్సులతో దర్శనం ఇచ్చే ఈమె జీవితంలోకి ఓ వ్యక్తి రాబోతున్నట్లు తెలిపింది. తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని తెలపడంతో అందరు షాకయ్యారు.. కాంట్రవర్సీ క్వీన్ ను పెళ్లి చేసుకోబోతున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు..
Also Read : ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ రివీల్.. ఎంత క్యూట్ గా ఉందో…?
ఉర్ఫీ జావేద్‌కి నిశ్చితార్థమైంది. ఒక మిస్టరీ మ్యాన్ ఉర్ఫీ వేలికి ఉంగరం తొడుగుతున్న ఫోటో ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది.. ఆ మూమెంట్ ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. సోషల్ మీడియా సెన్సేషన్ కి రహస్యంగా నిశ్చితార్థం అయిందా? లేదా ఇంకేదైనా ట్విస్ట్ ఉందా? అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ ఫ్యాన్స్ కు ఇది మింగుడు పడటం లేదు. ఫ్యాన్స్ ఈ ఫోటోగ్రాఫ్ పై ఉత్సాహంగా కామెంట్లు చేసారు. ఈమోజీలతో అభినందనలు తెలియజేసారు. కొందరు డిటెక్టివ్‌గా మారి ఆరాలు తీయడం ప్రారంభించారు. ఈ ఫోటోలో ఉన్న రహస్య వ్యక్తి ఎవరు? అని వెతికారు.. గూగుల్ లో దీని గురించి సెర్చ్ చేశారు..
అయితే నిజానికి ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని తెలింది. ఉర్ఫీ స్వయంగా ఇన్‌స్టాలో వివరాలు అందించింది. ఎక్స్ ఖాతాలో ఒక సీక్రెట్ పోస్ట్‌ను షేర్ చేస్తూ ఉర్పీ ఇలా రాసింది. యే ఇష్క్ నహీ అసన్ బస్ ఇత్నా సమాజ్ లిజియే ధోకే కా ఖత్రా హై, రోకా కర్కే జానా హై. ఫిబ్రవరి 14 నుండి డిస్నీ+ హాట్ స్టార్‌లో ఈ షో స్ట్రీమింగ్ కానుంది అని తెలిపింది. అంటే మొత్తానికి ఈ ఎంగేజ్మెంట్ ఉత్తుత్తి అని తేలింది. ఊర్ఫీ తన కెరీర్‌ను టెలివిజన్‌లో ప్రారంభించింది. బడే భయ్యా కి దుల్హానియా, మేరీ దుర్గా, బెపన్నా, , కసౌతి జిందగీ కే వంటి పాపులర్ షోలలో కనిపించింది. అయితే 2021లో బిగ్ బాస్ ఓటీటీలో పార్టిసిపెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. టెలివిజన్‌కు మించి ఉర్ఫీ ఇంటర్నెట్‌ను షేక్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించింది.. బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఆమె పూర్తిగా మారిపోయింది ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎన్నో వివాదాలను సంపాదించుకుంది. మొత్తానికి ఆమె నిత్యం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా ఉండేది. ఇప్పుడు మరోసారి ఈమె పేరు వైరల్ అవుతుంది.