Klinkaara : మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పుట్టిన పాపను ఎప్పుడు ఇప్పుడు చూస్తామని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా ప్రిన్సెస్ క్లింకార గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు ఆమె ఫేస్‌ను కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికీ చూపించలేదు. కానీ రామ్ చరణ్ మాత్రం నా కూతురు నాన్న అని పిలిచినప్పుడే అందరికి చూపిస్తానని అన్నారు. ఈ చర్చ జరిగి సరిగ్గా నెల రోజులు కూడా గడవకముందే.. మెగా ప్రిన్సెస్ క్లింకార ( klinkaara) వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. తాజాగా క్లింకార వీడియో ఒక నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో రామ్ చరణ్ తన కూతురిని ఎత్తుకొని నిల్చున్న వీడియోలను కొందరు నెట్టింట పోస్టు పెట్టారు. అది కాస్త వైరల్ కావడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్లింకార సూపర్ క్యూట్‌గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇన్ని రోజులు ఎదురుచూసిన దానికి ఫలితం దక్కిందంటూ అటు మెగా ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Klinkaara Baby చాలా క్యూట్ గా ఉంది 🥰🫠♥️♥️#KlinKaara#RamCharan#GlobalStarRamCharan pic.twitter.com/oTpBkmcOyA
— 🧚 NIMMI 💫✨🐦 (@AlwaysNirmala_) February 14, 2025
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఈయన ఇటీవల శంకర్ ( sankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీలో నటించాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్(Srikanth), అంజలి(Anjali), ఎస్‌జే సూర్య, బ్రహ్మానందం, సునీల్, జయరాం, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబట్టింది ఒకవైపు మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా మరోవైపు కలెక్షన్స్ దుమ్ము దులిపేసింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు ( Buchchibabu ) కాంబినేషన్లో తన 16వ సినిమా చేస్తున్నాడు ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది.. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమా అప్ డేట్స్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది…